సినిమాలే లేవు.. అయినా ఇల్లు ఎలా కొన్నది?  

Catherine Tresa Is Now A Proud Owner Of Duplex House Near Kokapet-

తెలుగు ప్రేక్షకులకు ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రం ద్వారా పరిచయం అయిన ముద్దుగుమ్మ కేథరిన్‌ తెర్సా. ఈ అమ్మడు కెరీర్‌ ఆరంభించి చాలా కాలం అయినా కూడా ఇప్పటి వరకు సరైన బ్రేక్‌ రాలేదు. ఈమె ఐటెం సాంగ్స్‌తో పాటు, అడపా దడపా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కొనసాగుతూ వస్తుంది...

సినిమాలే లేవు.. అయినా ఇల్లు ఎలా కొన్నది?-Catherine Tresa Is Now A Proud Owner Of Duplex House Near Kokapet

పలు చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో పోషించినప్పటికి ఈమెకు హీరోయిన్‌గా మాత్రం ఛాన్స్‌ రావడం లేదు. ఇలాంటి సమయంలో ఈమె హైదరాబాద్‌లోని కోకాపేటలో ఒక డూప్లెక్స్‌ హౌస్‌ను కొనుగోలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.

హైదరాబాద్‌లో ఒక అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేయాలి అంటేనే కోట్లలో డబ్బు కాల్సి ఉంటుంది.

అలాంటిది ఒక డూప్లెక్స్‌ హౌస్‌ను కొనుగోలు చేయాలి అంటే, అదీ కూడా ఖరీదైన కోకాపేట ఏరియాలో కొనుగోలు చేయాలి అంటూ బిగ్‌షాట్‌ అయ్యి ఉండాలి. ఎంతో మంది హీరోయిన్స్‌ సినిమాల్లో నటిస్తూ ఉన్నా కూడా హైదరాబాద్‌లో ఇల్లు కొనుగోలు చేసే స్థాయికి చేరడం లేదు. వారి ఆదాయం, ఖర్చుతో సరిపోతుందని వాపోతూ ఉంటారు.

కొందరు హీరోయిన్స్‌ రాబడి లేకున్నా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నారు. అలాంటిది కేథరిన్‌ తెర్సా దాదాపు 7.5 కోట్లు పెట్టి డూప్లెక్స్‌ హౌస్‌ను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటి వరకు కేథరిన్‌ తెర్సా నటించిన ఏ ఒక్క సినిమాకు కూడా 50 నుండి 60 లక్షల పారితోషికంను మించి వచ్చింది లేదు. ఇక ఈమె ఐటెం సాంగ్స్‌కు 30 నుండి 40 లక్షల మద్యలో తీసుకుంటుంది. అలాంటిది ఈమె అంత భారీ మొత్తం పెట్టి ఇల్లు కొనుగోలు చేయడం అందరిని ఆశ్చర్యపర్చుతుంది. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నప్పటికి ఇంత డబ్బు ఆమె జమ చేయడం అంటే మామూలు విషయం కాదని సినీ వర్గాల వారు అంటున్నారు.

కెరీర్‌ ఆరంభించినప్పటి నుండి వచ్చిన పారితోషికాలను మంచిగా మెయింటెన్స్‌ చేసుకుంటే ఖచ్చితంగా అంత డబ్బు జమ కూరే అవకాశం ఉంది. కాని హీరోయిన్స్‌ అన్నప్పుడు ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి...

అలాంటి ఖర్చులు అధిగమించడం వల్లే కేథరిన్‌ ఇల్లు కొనుగోలు చేసి ఉంటుందని కొందరు అంటుండగా, మరి కొందరు మాత్రం కేథరిన్‌కు సైడ్‌ బిజినెస్‌ ఏమైనా ఉందేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి కేథరిన్‌ తెర్సా ఒక ఇంటిది అవ్వడం ఆమెకు సన్నిహితంగా ఉండే వారికి, ఆమె అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇల్లు కొన్న శుభవేళ ఇప్పటికి అయినా తెలుగులో ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తాయేమో చూడాలి.