కళ్యాణ్ రామ్ కి జోడీగా అల్లు అర్జున్ హీరోయిన్

టాలీవుడ్ లో కొంత మంది భామలకి అందం లేకపోయిన అదృష్టం ఉండటంతో వెంటనే వెంటనే సినిమాలలో నటిస్తూ స్టార్హీరోయిన్ గా ఎదిగిపోతారు.ఒకసారి సక్సెస్ వచ్చాక వారు తమ అందాలకి మరింత మెరుగులు దిద్దుకుంటారు.

 Catherine Romance With Kalyan Ram, Tollywood, Telugu Cinema, Tughlaq Movie, Venu-TeluguStop.com

కొంత మంది అందాల భామలు ఎంతఅందంగా ఉన్న, గ్లామర్ పరంగా బెస్ట్ అనిపించుకున్న, పెర్ఫార్మెన్స్ తో పర్వాలేదనిపించుకున్న స్టార్ హీరోయిన్ గా మాత్రం గుర్తింపుని సొంతం చేసుకోలేరు.అప్పుడప్పుడు అలా కనిపించి పోతూ ఉంటారు.

ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ హీరోయిన్ కేథరీన్ పరిస్థితి కూడా ఇంచు మించు అలాంటిదే.ఈ అమ్మడుకి అందంతో పాటు అభినయం కూడా ఉంది.

అలాగే ఈమె నటించిన సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి.అయితే అన్ని సినిమాలలో సెకండ్ హీరోయిన్ పాత్రలకే ఎక్కువ పరిమితం కావడం వలన ఆ సినిమాల సక్సెస్ క్రెడిట్ ని కేథరీన్ సొంతం చేసుకోలేకపోయింది.

మెయిన్ హీరోయిన్ గా చేసిన సినిమాలు వర్క్ అవుట్ కాకపోవడంతో అనుకున్న స్థాయిలో అవకాశాలు రావడం లేదు.

Telugu Catherine, Catherine Tresa, Kalyan Ram, Telugu, Tollywood, Tughlaq, Venu

ఇద్దరమ్మాయిలతో, నేనే రాజు నేనే మంత్రి, వరల్డ్ ఫేమస్ లవ్ స్టోరీ సినిమాలలో సినిమాలలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలలో కేథరీన్ నటించింది.అయిన ఆమెని మెయిన్ హీరోయిన్ గా మాత్రం టాలీవుడ్ దర్శక, నిర్మాతలు పరిగణించడం లేదు.ఇదిలా ఉంటే చాలా గ్యాప్ తర్వాత కళ్యాణ్ రామ్ లాంటి స్టార్ హీరోతో మెయిన్ హీరోయిన్ గా నటించే అవకాశం కేథరీన్ సొంతం చేసుకుంది.

వేణు మల్లిడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ తుగ్లక్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.ఇందులో ఒక హీరోయిన్ గా కేథరీన్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.త్వరలో దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube