చెత్తకుప్పలో పడింది... మంత్రి ఆఫీసుకు వెళ్ళింది!

చాలా వరకు కొందరికీ అదృష్టం అదంతట అదే వెతుక్కుంటూ మరీ వస్తుంది.ఎక్కడో అందని స్థానంలో ఉంటే… కలలో ఊహించుకొని స్థానంలో నిలుస్తాము.అలా ఉండాలన్న కూడా అదృష్టం ఉండాలి.నూటికో… కోటికో… అలా జరుగుతూ ఉంటాయి.ఇలా మనుషులకే కాకుండా జంతువులలో కూడా అదృష్టం ఉంటుందనే చెప్పుకోవాలి.కాగా చెత్తకుప్పలో పడింది… మంత్రి ఆఫీస్ కు వెళ్ళింది….అని ఏంటా అనుకుంటున్నారా….!
అది ఏంటో కాదు ఒక పిల్లి.

 Russia, Cat Rescued From Garbage, Ministry Of Environment ,deputy Minister , Tra-TeluguStop.com

అది ఏ పుణ్యం కట్టుకుందో గాని… రాజయోగాలు అనుభవిస్తుంది.అంతేకాకుండా ఓ పదవిని కూడా దక్కించుకుంది ఆ పిల్లి.

రష్యాలోని ఉలియానోవ్సక్ లోని మున్సిపాలిటీ కి సంబంధించిన ఓ వ్యక్తి గత సోమవారం రోజున చెత్తను ముక్కలు ముక్కలుగా చేసే యంత్రం దగ్గర ఉండి గమనిస్తున్నాడు.దీంతో అందులో ఓ తెల్లని ప్లాస్టిక్ కవరు కదులుతూ ఉండటం తో వెంటనే ఆ వ్యక్తి కవరు తీసి చూశాడు.

Telugu Catrescued, Deputy, Ministry, Russia-Telugu NRI

కవర్ లో చూసే సరికి ఓ పిల్లి కనిపించింది.తర్వాత ఆ పిల్లిని పర్యావరణ మంత్రిత్వ శాఖ వద్దకు తీసుకెళ్లగా ఆయన దానిని పెంచుకోవడానికి దత్తత తీసుకున్నాడు.అంతేకాకుండా దానికి ఉప మంత్రి హోదాను కల్పించాడు.మంత్రి ఆ పిల్లిలో ఉన్న సమయంలో … ఆ పిల్లి కుర్చీలో నిద్ర పోతున్నా ఫోటోలను షేర్ చేశారు.

ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంతేకాకుండా ఆ పిల్లికి పేరు పెట్టడానికి ఓ కంటెస్ట్ ను కూడా పెట్టడం జరిగింది.

దీంతో మంత్రి పిల్లిలను పెంచుకునే యజమానులను వాటిని వదిలేయకుండా బాధ్యత తీసుకోవాలని తెలిపారు.లేదా వాటిని మీరు చూసుకోకపోతే జంతువులను పెంచుకొనే వారికి ఇవ్వాలని కోరాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube