ఇంట్లో ఫుట్ బాల్ ఆడేస్తున్న పిల్లి.. వీడియో వైర‌ల్‌

ఒక‌ప్పుడు ఇంట్లో పెద్ద‌గా పెంపుడు జంతువుల‌ను పెంచుకునే వారు కాదు.కానీ ఇప్పుడు మాత్రం ప్ర‌తి ఇంట్లో మ‌న‌కు పెంపుడు జంతువులు అనేవి కామ‌న్ గానే కనిపిస్తున్నాయి.

 Cat Playing Football At Home Video Viral Details, Viral Video, Cat Playing, Viral Animals Vidoe, Social Media, Pet Animals, Cat Playing Football, Balloon, Funny Animals Video, Pet Cat-TeluguStop.com

అయితే ఈ పెంపుడు జంతువుల్లో కూడా చాలా ర‌కాలు ఉంటున్నాయండోయ్‌.అవేంటంటే.

ఒక‌ప్పుడు కుక్క‌ల‌ను మాత్ర‌మే పెంచుకునే వారు.కానీ ఇప్పుడు పిల్లుల‌ను కూడా పెంచుకుంటున్నారు.

 Cat Playing Football At Home Video Viral Details, Viral Video, Cat Playing, Viral Animals Vidoe, Social Media, Pet Animals, Cat Playing Football, Balloon, Funny Animals Video, Pet Cat-ఇంట్లో ఫుట్ బాల్ ఆడేస్తున్న పిల్లి.. వీడియో వైర‌ల్‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ పెంపుడు జంతువులు చాలా తెలివి మీరి పోతున్నాయండోయ్‌.అవి అచ్చం మ‌నుషుల‌ను అనుక‌రిస్తున్న‌ట్టు ఉన్నాయి.

మ‌నుషులు ఏం చేస్తే అవి కూడా అలాంటి ప‌నులే చేస్తున్నాయి.ఆట‌లు ఆడుతున్నాయి.

ప్రేమ‌, కోపాన్ని కూడా చూపిస్తున్నాయి.వాటిని ఇన్ స‌ల్ట్ చేసిన‌ట్టు ఏమైనా చేస్తే గ‌న‌క అవి ఫీల్ అవ్వ‌డం కూడా మ‌నం అనేక వీడియోల్లో చూస్తున్నాం.

ఇక మ‌నుషుల‌తో పాటు కొన్ని ఆటల్లో కూడా పాల్గొంటున్నాయి.మొన్న ఓ కుక్క దాగుడు మూత‌లు ఆడుతున్న వీడియో ఎంత‌లా వైర‌ల్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

అయితే తాజాగా మ‌రో వీడియో ఇలాగే వైర‌ల్ అవుతోంది.దీనిపై నెటిజ‌న్లు చాలా ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇందులో ఆ పిల్లి ట్యాలెంట్‌కు అంద‌రూ ఫిదా అవుతున్నారు.ఈ వైర‌ల్ వీడియోలో ఓ పిల్లి ఇంట్లో బెలూన్ తో ఫుట్ బాల్ ఆడుతున్న‌ట్టు మ‌న‌కు క‌నిపిస్తుంది.ఇందులో ఆ పిల్లి ఓ బ్లూ క‌ల‌ర్ లో ఉన్న బెలూన్‌ను త‌న కాళ్ల న‌డుమ వేసుకుని త‌న్నుకుంటూ పోతున్న‌ట్టు క‌నిపిస్తుంది.అయితే ఫుట్ బాల్ ప్లేయ‌ర్లు ఆడిన‌ట్టే అచ్చం ఆడేస్తోంది ఈ పిల్లి.

ఆ బాల్‌ను చేజారిపోనివ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతూ ఆడ‌టం మ‌న‌కు ఇందులో క‌నిపిస్తుంది.దీన్నంతా కూడా కొంద‌రు వీడియో తీయ‌గా.

విప‌రీతంగా ట్రెండ్ అవుతోంది.మ‌రి లేటెందుకు మీరు కూడా చూసేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube