పెంపుడు పిల్లికి కరోనా పాజిటివ్... వాస్తవం ఇదే అంటున్న వైద్యులు

కరోనా వైపు గబ్బిలాల నుంచి మనుషులకి వచ్చిందని ఇప్పటికే ఒక అంచనా వేస్తున్నారు.చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచం అంతా విస్తరించి లక్షల సంఖ్యలో మనుషులకి వ్యాపించిది.

 Cat In Belgium First Known To Test Positive For Corona Virus, Corona Effect, Cov-TeluguStop.com

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంచు మించు అన్ని దేశాలు కరోనా బారిన పడ్డాయి.ఇక ఇటలీ, అమెరికా, స్పెయిన్ లాంటి దేశాలు కరోనా మరణాలతో వణికిపోతున్నాయి.

అయితే బెల్జియంలో ఇప్పుడు మరో భయానకమైన వాస్తవం వెలుగు చూసింది అని తెలుస్తుంది.ఓ పెంపుడు పిల్లికి వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

దీని బట్టి పెంపుడు జంతువులకు వైరస్ వ్యాపిస్తుంది.హాంగ్ కాంగ్ లో కుక్కలకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.

అయితే కుక్కల్లలో మాత్రం వైరస్ లక్షణాలు కనిపించలేదు.

అయితే పెంపుడు జంతువులకి కూడా ఇలా కరోనా వైరస్ సోకడం ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారబోతుందని అని తెలుస్తుంది.

వాటికి వస్తే వాటి ద్వారా మిగిలిన జంతువులకి కూడా కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయి.మనుషులని లాక్ డౌన్ తో కట్టడి చేయవచ్చు.కాని జంతువులకి వస్తే ఇక ఎలాంటి లాక్ డౌన్ ఆపలేదు.ప్రపంచం మొత్తం నాశనం అయిపోయిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

పిల్లిలో మాత్రం కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి.పూర్తి వివరాలు చూస్తే .ఆ పిల్లిని పెంచుకుంటున్న వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.దాంతో ఆ పిల్లికి కూడా వైరస్ టెస్టు చేస్తే పాజిటివ్ అని వచ్చినట్లు తెలుస్తుంది.

దీంతో పిల్లిని 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచాలని వైద్యులు ఆదేశించారు.ఆ పిల్లి శ్వాస కోశ జీర్ణ సమస్యలతో బాధపడుతోందని బెల్జియం ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ ఏఎఫ్ ఎస్ సీఏ ఒక ప్రకటనలో తెలిపింది.

దీనిని పూర్తిగా కరోనా అని నిర్ధారించలేమని చెబుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube