ఈ సువిశాల భూభాగం మీద ఎన్నో రకాల వింత వింత జీవులు పుట్టే ఉన్నాయి.అప్పుడప్పుడు వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉంటాం.
ఇందులో అప్పుడప్పుడు రెండు తలల పాముల గురించి చూస్తూనే ఉంటాం.ఇలా రెండు తలలు ఉన్న పాములు చూడడం చాలా అరుదు.
ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియాలో ఒకరి ఇంట్లో ప్రత్యక్షమైన రెండు తలల పాము గురించి చూసాం.అయితే తాజాగా అమెరికా దేశంలో తాజాగా ఓ రెండు తలల పాము కనిపించి అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో పామ్ హార్బర్ లో నివసిస్తున్న కే రోజెర్స్ పిల్లిని పెంచుకుంటుంది.
ఆ పిల్ల పేరు ఆలివ్.ఆలివ్ ఇంటి బయట ఉన్న ఆవరణలో సరదాగా ఆడుకోవడం దానికి బాగా అలవాటు.
అలవాటులో భాగం గానే తాజాగా పిల్లి బయటికి వెళ్లి ఆడుకొని తిరిగి ఇంట్లోకి వచ్చే సమయంలో ఏదో వస్తువు అనుకుని పొరపాటున ఆ పిల్లి రెండు తలల పామును ఇంట్లోకి తీసుకు వచ్చింది.అలా ఆ పిల్లి నేరుగా వారి ఇంట్లోని లివింగ్ రూమ్ లోకి తీసుకు వచ్చి ఓ కార్పెట్ పై ఆ పామును ఉంచింది.
అయితే ఆ పిల్లి ఓనర్ రోజెర్స్ కూతురు మొదట ఆ పామును చూసి భయపడి పోయింది.అయితే, ఆ పాము కాస్త వింతగా అనిపించడంతో ఎక్కడికి పారిపోకుండా దానిని బంధించింది.
అంతేకాదు ఆ రెండు తలల పాముకు డోస్ అనే పేరును కూడా నామకరణం చేసేసింది.
అయితే ఆ తర్వాత రోజెర్స్ ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేసి తెలపగా వారు వచ్చి ఆ రెండు తలల పామును తీసుకెళ్లిపోయారు.
జన్యు లోపం కారణం వల్లే ఇలాంటి పాములు పుడతాయని వారు తెలిపారు.ప్రస్తుతం ఈ రెండు తలల పామును జూ లో ఉంచి దాని సంరక్షణ బాధ్యతలు చేపడుతున్నారు.