తెలుగు బిగ్‌బాస్‌లో కాస్టింగ్‌ కౌచ్‌ అంటూ శ్వేతారెడ్డి సంచలన వ్యాఖ్యలు  

Casting Couch In Telugu Big Boss Show-hindhi,social Media,swetha Reddy,tamil,telugu,telugu Big Boss,ప్రముఖ యాంకర్‌

సినిమా పరిశ్రమకు మాత్రమే పరిమితం అయిన కాస్టింగ్‌ కౌచ్‌ ఇప్పుడు బుల్లి తెరపై కూడా పాకిందనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 3 మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఈ షో కోసం పదుల సంఖ్యలో సెలబ్రెటీలతో చర్చలు జరపడం జరిగిందట. ఏప్రిల్‌ నుండి ఈ చర్చలు జరుగుతున్నాయి..

తెలుగు బిగ్‌బాస్‌లో కాస్టింగ్‌ కౌచ్‌ అంటూ శ్వేతారెడ్డి సంచలన వ్యాఖ్యలు-Casting Couch In Telugu Big Boss Show

దాదాపు 30 మందిని ఎంపిక చేసిన బిగ్‌బాస్‌ నిర్వాహకులు వారిలో ఎవరైతే షోకు ఎక్కువగా టీఆర్పీ రేటింగ్‌ను తీసుకు రాగలరు అనే విషయాన్ని కాచి వడగట్టి చివరకు ఎంపిక చేయడం జరిగిందట.

ఇక ఈ సీజన్‌ కోసం ప్రముఖ యాంకర్‌, సోషల్‌ మీడియా సెన్షేషన్‌గా పేరు తెచ్చుకున్న శ్వేత రెడ్డితో సంప్రదింపులు జరిగాయట. రెండు మూడు సార్లు ఇంటర్వ్యూ చేయడం, ఆమె గురించిన వివరాలు తెలుసుకోవడం చేశారట. పూర్తి బ్యాక్‌ గ్రౌండ్‌ చూసిన తర్వాత అంతా ఓకే అనుకున్న తర్వాత మా బాస్‌ను తృప్తి పర్చేందుకు మీరు ఏం చేస్తారు అంటూ షో నిర్వహకుల్లో ఒకరు అడిగారట. అంటే తనకు అర్థం కాలేదని, తృప్తి పర్చడం అంటే ఎలా అంటూ నేను అడిగాను.

మీకు తెలిసే ఉంటుంది కదా ఎలా తృప్తి పర్చాలో అంటూ అతడు అనడంతో శ్వేత రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట..

తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెళ్లడించింది. బిగ్‌బాస్‌ షోకు ఎంపిక చేసే క్రమంలో కూడా కాస్టింగ్‌ కౌచ్‌ జరుగుతుందని, ఇది తన విషయంలో జరిగిందని, గతంలో కూడా జరిగి ఉంటుందని తాను భావిస్తున్నట్లుగా శేత పేర్కొంది. బాస్‌ను సంతృప్తి పర్చితే బిగ్‌బాస్‌లోకి వెళ్లే అవకాశం ఇస్తారట.

ఈ విషయంపై ఆమె తీవ్ర మనస్థాపంకు గురైనట్లుగా పేర్కొంది. తాను బిగ్‌బాస్‌ ఆఫర్‌ను అడగలేదు. వారే ఏప్రిల్‌లో నా వద్దకు వచ్చి మీకు బిగ్‌బాస్‌ ఆఫర్‌ ఇస్తామన్నారు..

నేను సరే అన్నారు. చివరకు కమిట్‌మెంట్‌ కోరడంపై శ్వేత ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ విషయమై బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఇంకా స్పందించలేదు.