ఏపీ టీడీపీలో ప్రస్తుతం గుడివాడ క్యాసినో రచ్చ కొనసాగుతూనే ఉంది.ఇప్పడప్పుడే ఈ వ్యవహారం చల్లబడేలా కనిపించడం లేదు.
వైసీపీని ఎలాగైనా సరే ఇరుకున పెట్టేందుకు టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.వైసీపీ సర్కార్ ను బ్లేమ్ చేసే విషయంలో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోని టీడీపీ క్యాసినో వ్యవహారాన్ని కూడా లైట్ తీసుకోవడం లేదు.
ఇప్పటికే తమ పార్టీ తరఫున ఈ అంశం చర్చించేందుకు నిజ నిర్ధారణ కమిటీని వేసింది.ఈ కమిటీలో టీడీపీ సీనియర్ నాయకులు ఉన్నారు.
వీరంతా విజయవాడ నుంచి గుడివాడకు నిజనార్ధరణ అంటూ అక్కడికి వెళ్లారు.కానీ అక్కడ కూడా పెద్ద రచ్చే జరిగింది.
చివరకు టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో పెద్ద ఎత్తున గొడవ జరిగింది.ఈ గొడవలో టీడీపీ నాయకులు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
దీంతో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకోవడంతో గొడవ కాస్త పెద్దదిగా మారింది.
గుడివాడ క్యాసినో రచ్చ ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.
అధికార పార్టీకి చెందిన వైసీపీ ఎంపీ కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ సెంటర్లో సంక్రాంతి పండుగ సందర్భంగా గోవాకు చెందిన కొంత మందితో మంత్రి కొడాలి నాని క్యాసినో పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
దీనిపై బుద్దా వెంకన్న కొడాలి నాని, మరియు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై అనేక రకాలుగా ఆరోపణలు చేశాడు.దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.డీజీపీ మీద తీవ్ర ఆరోపణలు చేసిన టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్నను అరెస్టు చేశారు.
ఈ అరెస్టుపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు.ఇది సరైన పద్ధతి కాదంటూ ఇలా పోలీసులు వ్యవహరించడం సరి కాదని విమర్శిస్తున్నారు.