నగదు రహిత వ్యాపారాలపై నిషేధం: న్యూయార్క్ కౌన్సిల్ తీర్మానం

నగదు రహిత వ్యాపారాలను నిషేధించేందుకు గాను న్యూయార్క్ సిటీ కౌన్సిల్ ఓటు వేసింది.డిజిటల్ ఎకానమీపై మితిమీరిన నియంత్రణ మరియు అల్పాదాయ వర్గాలపై వివక్షను ఆపే ప్రయత్నంగా రాజకీయ నాయకులు ఈ చర్యను అభివర్ణించారు.

 Cashless Businesses New York Council-TeluguStop.com

నగదు చెల్లింపును అంగీకరించని దుకాణాలు, రెస్టారెంట్లు సహా రిటైల్ ఔట్‌లెట్లకు జరిమానా విధించే చట్టాన్ని సిటీ కౌన్సిల్ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఎలక్ట్రానిక్ చెల్లింపుల విధానంలో అల్పాదాయ వర్గాలు, అక్రమ వలసదారులు, బ్యాంకు లేదా క్రెడిట్ యాక్సెస్ పట్ల వివక్ష చూపుతున్నందున నిషేధానికి మద్ధతుదారులు అనుకూలంగా వాదించారు.

ఈ బిల్లును కనుక మేయర్ బిల్‌ డి బ్లాసియో ఆమోదించినట్లయితే న్యూయార్క్ సిటిలో వ్యాపారాలను డెబిట్, క్రెడిట్ ద్వారా అంగీకరించకుండా నిషేధించడానికి వీలు కలుగుతుంది.న్యూజెర్సీ, ఫిలడెల్ఫియా, శాన్‌ఫ్రాన్సిస్కో 2019లోనే నగదు రహిత వ్యాపారాలను నిషేధించిన సంగతి తెలిసిందే.

Telugu York Council, Telugu Nri Ups-

న్యూయార్క్‌లోని వ్యాపారాలకు నగదును తిరస్కరించే హక్కు ఉండదని బిల్లు యొక్క ప్రధాన స్పాన్సర్ కౌన్సిల్‌మెన్ రిచీ టోర్రెస్ ట్విట్టర్‌లో తెలిపారు.న్యూయార్క్ వినియోగదారులు, కార్మిక రక్షణ విభాగం 2019 నివేదిక ప్రకారం నగరంలో 11 శాతం వ్యక్తులకు బ్యాంక్ ఖాతా లేదని తేలింది.22 శాతం మంది చెల్లింపుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగిస్తున్నారని పేర్కొంది.క్రెడిట్ లేదా డెబిట్ మాత్రమే ఉపయోగించమని వినియోగదారులను బలవంతం చేయడం వివక్షే అన్నారు.

ఈ బిల్లు కారణంగా ప్రతి ఒక్కరూ తమ నగరంలోని ఏ దుకాణంలోనైనా షాపింగ్ చేయవచ్చునని, తినగలరని రిటైల్, హోల్‌సేల్ డిపార్ట్‌మెంట్ స్టోర్ యూనియన్ అధ్యక్షుడు స్టువర్ట్ అప్పెల్బామ్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube