వ్యాక్సిన్ వేసుకునే వారికి నగదు బహుమతి..బిడెన్ సంచలన నిర్ణయం..!!!

అమెరికాలో కరోన మహమ్మారి మరో సారి తీవ్ర రూపం దాల్చుతోంది.కరోనా మొదటి, రెండవ వేవ్ లకంటే కూడా థర్డ్ వేవ్ డెల్టా చాలా వేగంగా వ్యాప్తి చెందటంతో అమెరికన్స్ ఆందోళన చెందుతున్నారు.

 Cash Prize For Those Who Get Vaccinated Biden Sensational Decision-TeluguStop.com

వ్యాక్సిన్ వేసుకున్న వారు, వేసుకుని వారు ఇలా ఇద్దరిలో కరోనా కేసులు పెద్దగా తేడా లేకపోయినా, వ్యాక్సిన్ వేసుకున్న వారిపై ఎక్కువగా ప్రభావం చూపడంలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు కానీ ప్రస్తుతం అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండటంతో.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

 Cash Prize For Those Who Get Vaccinated Biden Sensational Decision-వ్యాక్సిన్ వేసుకునే వారికి నగదు బహుమతి..బిడెన్ సంచలన నిర్ణయం..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమెరికా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగవంతం అవడానికి అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఇకపై వ్యాక్సిన్ వేసుకునే వారికి ప్రభుత్వం తరుపునుంచీ సుమారు 100 డాలర్లు బహుమతిగా ఇవ్వబడునని ప్రకటించారు.

అలాగే మీమీ రాష్ట్రాల ప్రజలకు ఈ విషయం తెలియజేయాలని త్వరతగతిన వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు.ఈ నగదు ప్రోశ్చాహకం అందించడం వలన వ్యాక్సిన్ వేసుకొని వారి సైతం ముందుకు వస్తారని తెలిపారు.

అమెరికా ప్రజల ముందు మరో ఛాలెంజ్ ఉందని, మొదటి వేవ్ పరిస్థితులు మన దేశంలో మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ప్రతీ ఒక్కరూ వ్యాక్సినేషన్ తో పాటు మాస్క్ లు ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని కోరారు.వ్యక్తిగతంగా ఎవరికి వారు భాద్యతగా ఉండాలని, డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ అని, ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని కోరారు.

ఇదిలాఉంటే వ్యాక్సినేషన్ తీసుకునే వారికి నగదు బహుమతి ఇస్తునప్పుడు ముందుగానే తీసుకున్న వారికి అన్యాయం జరిగినట్టేనని అయితే మిమ్మల్ని మహమ్మారి బారి నుంచీ కాపాడటానికి ఇంతకు మించి వేరే అవకాసం లేదని అమెరికా ప్రజలు సహకరించాలని బిడెన్ కోరారు.

#Wave Delta #Process America #Delta Variant #Prize #Biden

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు