రాజీవ్ ను పట్టుకుని ఏడ్చేసిన సుమ... అనుమానాలన్నీ పటాపంచలే?

సాధారణంగా సెలబ్రిటీ జంటల గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వచ్చే గాసిప్స్ అన్నీఇన్నీ కాదు.వాళ్లు సంతోషంగానే ఉన్నా విడిపోయారని వార్తలు వస్తూ ఉంటాయి.

 Suma Cried In Cash Program, Divorce Rumors, Social Media,cash Latest Promo, Rela-TeluguStop.com

ఈ వార్తలు ఆ సెలబ్రిటీ జంటలను బాధ పెట్టినా చాలా సందర్భాల్లో అలాంటి వార్తల గురించి వాళ్లు స్పందించరు.కొన్ని రోజుల క్రితం టాప్ యాంకర్ సుమ, ఆమె భర్త విడిపోయారని వాళ్లు వేర్వేరుగా ఉంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే అటు సుమ కానీ ఇటు రాజీవ్ కానీ ఆ వార్తల గురించి స్పందించలేదు.దీంతో చాలామంది ఆ వార్తలు నిజమేనని నమ్మేశారు.

అయితే తాజాగా ఒకే ఒక్క ప్రోమోతో ఈ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.చిలుకాగోరింకల్లా చూడముచ్చటగా కనిపించే సుమ, రాజీవ్ కనకాల తాము కలిసే ఉన్నామని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్యాష్ లేటెస్ట్ ప్రోమోతో ప్రూవ్ చేశారు.

ప్రోమోలో వాళ్లిద్దరి మధ్య ప్రేమ, అనురాగం చూసిన తరువాత వాళ్లు విడిపోయారని వచ్చిన వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని సులభంగానే అర్థమవుతుంది.

ఇద్దరూ కలిసి పాటలు పాడి, డ్యాన్సులు చేసిన క్యాష్ లేటెస్ట్ ప్రోమో అదిరిపోయిందనే చెప్పాలి.

ప్రోమో చివరలో సుమను రాజీవ్ ఓదార్చడం ప్రోమోకే హైలెట్ గా నిలిచింది.ఈ ప్రోగ్రామ్ కు రాజీవ్ తో పాటు రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, సమీర్ వచ్చారు.

వీళ్లు కూడా షోలో కామెడీ పండించి షోకు అదనపు ఆకర్షణగా నిలిచారు.ఈ ప్రోమో చూసిన తరువాత రాజీవ్, సుమ మధ్య విభేదాలు ఉన్నట్టు ఇంకెప్పుడూ వార్తలు రావేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube