ఓటుకు నోటులో సంచలనం..,మత్తయ్య లేఖతో రేవంత్ జైలుకేనా..?   Cash-for-Vote Case Shocking Twist     2018-02-24   01:41:34  IST  Bhanu C

ఓటుకు నోటు కేసు ఎంత సంచలనమే వేరే చెప్పనవసరేం లేదు…తన రాజకీయ జీవితంలో ఏనాడు అపఖ్యాతిని మూటగట్టుకొని చంద్రబాబు సైతం ఈ ఓటుకు నోటు ద్వారా చంద్రుడుకి లో మచ్చలా అయిపోయాడు..అప్పట్లో వైసీపి , టీఆర్ఎస్ పార్టీలు చంద్రబాబు ని డ్యామేజ్ చేయాలని ఈ కేసులో తీవ్రమైన ఒత్తిడులకి కూడా పాల్పడ్డారు అనే టాక్ కూడా ఉంది..అయితే ఈ తతంగం జరిగిన చాన్నాళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న మాత్తయ్య బయటకి వచ్చాడు ఈ కేసులో అప్రూవ‌ర్ గా మారుతున్న‌ట్లు బాంబు పేల్చాడు..

అసలు వివరాలలోకి వెళ్తే..ఈ కేసులో కీలక వ్యక్తి అయిన మత్తయ్య..ఏకంగా చీఫ్ జ‌స్టిస్ కి అప్రూవ‌ర్ గా మారుతున్న‌ట్లు లేఖ రాశాడు..దాంతో రాజకీయంగా ఈ వార్తా ప్రకంపనలు రేపుతోంది..అయితే మత్తయ్య అప్రూవ‌ర్ గా మారితే ఎవరికీ నష్టం అంటే రేవంత్ కి మాత్రం ఎంతో భవిష్యత్తు అంధకారమే అంటున్నారు..అంతేకాదు రేవంత్ రెడ్డి మ‌ళ్లీ జైలుకి వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి అంటున్నారు..గతంలో ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉందని చెప్పమంటూ ఒత్తిడి తెచ్చారు అంటూ మత్తయ్య సంచలన విషయాలు వెల్లడించాడు..చంద్రబాబు ని ఇరికేచే ప్రయత్నంలో నన్ను పావుగా వాడుకున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు..అప్పట్లో.

అయితే సుమారు రెండేళ్ళ తరువాత ఇప్పుడు ఎన్నికలు దెగ్గర పడుతున్న సమయంలో మత్తయ్య ఇలా యూటర్న్ తీసుకోవడంలో మర్మం ఏమిటో అర్థం కావడం లేదు..ఏ4 నిందితుడు మ‌త్త‌య్య అప్రూవ‌ర్ గా మారుతున్న‌ట్లు సుప్రీంకోర్టు చీఫ్ కి లేఖ రాసి త‌న వాద‌న‌ను వ్య‌క్తిగ‌తంగా వినాల‌ని కోరారు. వ్య‌క్తిగ‌తంగా త‌న వాద‌న‌ను వినాల‌ని మ‌త్త‌య్య కోరుతుండ‌టంతో కేసు ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో అనేది ఆసక్తి రేపుతోంది…ఈ విషయంలో మత్తయ్య ఎటువంటి విషయాలని వెల్లడించినా సరే ముందుగా శిక్ష పడేది మాత్రం రేవంత్ రెడ్డి కే దీంతో రేవంత్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు న్యాయవాదులు..మరి జస్టీస్ దగ్గర మత్తయ్య ఎలాంటి విషయాలు వెల్లడిస్తాడో నని రెండు రాష్టాల రాజకీయ నేతలు ఎదురు చూస్తున్నారు..