ఏపీలో అక్క‌డ ఒక్క ఓటు రేటు రూ.10 ల‌క్ష‌లు

ఒక్క ఓటు రేటు మ‌హా అయితే రూ.500 నుంచి రూ.1000 ఇంకా చెప్పాలంటే రూ.2000 వ‌ర‌కు ప‌లుకుతుంది.ఎన్నిక‌లు హోరాహోరీగా జ‌రిగి, బ‌ల‌మైన అభ్య‌ర్థులు నిల‌బ‌డిన చోట రూ.5000 ప‌ల‌క‌డం చూశాం.కానీ ఏపీలో ఓ ఎన్నిక‌లో మాత్రం ఒక్క ఓటు రేటు రూ.10 ల‌క్ష‌లు ప‌లుకుతోంది.ఓటు రేటు రూ.10 ల‌క్షాలా.? ఆ ఎన్నిక ఎక్క‌డ ? ఆ స్టోరీ ఏంటో చూద్దాం.

 Cash Flow In Kadapa Mlc Elections-TeluguStop.com

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లాలో అప్పుడే క్యాంపు శిబిరాలు స్టార్ట్ అయ్య‌యి.

ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్థిగా వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ బాబాయ్‌, వైఎస్ వివేకానందరెడ్డి, టీడీపీ అభ్య‌ర్థిగా బీటెక్ ర‌వి రంగంలో ఉన్నారు.

వీరిద్ద‌రు ఆయా పార్టీల త‌ర‌పున విజ‌యం కోసం వేయ‌ని ఎత్తులు లేవు, గీయ‌ని ప్లాన్లు లేవు.ఇక ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల‌కు టైం ఉన్నా ఈ ఇద్ద‌రు స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ముందుగానే మ‌చ్చిక చేసుకుంటున్నారు.

ఒక్కో ఓటుకు రూ.5 నుంచి రూ.10 లక్షలు ఇస్తామని హామీ ఇస్తూ…ముందుగానే కొంత మొత్తం ఇస్తున్నార‌ట‌.ఈ అడ్వాన్స్ అమౌంట్ మొత్తం కొత్త రూ.2 వేల నోట్లే కావ‌డం విశేషం.ఈ క్ర‌మంలో అటు ర‌వి శిబిరం, ఇటు వివేక ఇద్ద‌రూ ఆదివారం నాడే కొంత‌మంది అభ్య‌ర్థుల‌ను త‌మ త‌మ శిబిరాల‌కు త‌ర‌లించి… అక్క‌డే ఈ అడ్వాన్స్‌లు అంద‌జేసిన‌ట్టు స‌మాచారం.

మ‌హిళా ఓట‌ర్లు అయితే వారికి తోడుగా వారి భ‌ర్త‌ల‌ను లేదా కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రిని కూడా ఈ శిబిరాల‌కు తీసుకెళుతున్నార‌ట‌.

జ‌గ‌న్ సొంత జిల్లాలో త‌న బాబాయ్‌ను గెలిపించుకోవ‌డం ద్వారా త‌న స‌త్తా చాటాల‌ని చూస్తుంటే, టీడీపీ మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోను ఇక్క‌డ విజ‌యం సాధించి జ‌గ‌న్‌కు చెక్ పెట్టాల‌ని చూస్తోంది.

ఈ ఎన్నిక‌ల్లో స్థానిక సంస్థ‌ల‌కు చెందిన మండ‌ల ప‌రిష‌త్‌, జిల్లా ప‌రిష‌త్‌, మునిసిపాలిటీలు, న‌గ‌ర‌పాల‌క సంస్థ‌ల్లో గెలిచిన వారంద‌రికి ఓటు హ‌క్కు ఉంటుంది.వాస్త‌వంగా చూస్తే జిల్లాలో 70 శాతం మంది ప్ర‌జాప్ర‌తినిధులు వైసీపీకి చెందిన వారే ఉన్నారు.

టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ రంగంలోకి దిగి ఓట్ల కొనుగోలును స్టార్ట్ చేసిన‌ట్టు టాక్‌.ఈ లెక్క‌న చూస్తుంటే క‌డ‌ప ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో నోట్ల క‌ట్ట‌లు కోట్ల‌లో తెగేలా క‌నిపిస్తున్నాయి.

మ‌రి ఈ కోట్ల నోట్ల పోరులో ఎవ‌రు విన్ అవుతారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube