కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ : చుట్టుముట్టిన కేసులు ? 

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన హుజురాబాద్ కీలక నేత పాడి కౌశిక్ రెడ్డి భవిష్యత్తు గందరగోళంలో పడింది.టిఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చిన సందర్బం లో ఆయన మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో పెద్ద దుమారమే రేపింది.

 Cases That Have Been Troubling Mlc Koushik Reddy,  Koushik Reddy, Mlc Koushikare-TeluguStop.com

ఆయనను హుజురాబాద్ అభ్యర్థిగా టిఆర్ఎస్ ప్రకటించేందుకు వెనకంజ వేసింది.ఈ క్రమంలోనే ఆయన శక్తి సామర్ధ్యాలను గుర్తించి ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది.

దీనికి సంబంధించిన ఫైలును గవర్నర్ కార్యాలయానికి ఈనెల రెండో తేదీన తీర్మానం చేసి పంపించినా, ఇప్పటి వరకు గవర్నర్ ఆమోదం లభించకపోవడం అనేక అనుమానాలు కలిగిస్తోంది.అయితే క్యాబినెట్ తీర్మానం అయిన తర్వాత ఆ ఫైలును గవర్నర్ కార్యాలయానికి పంపించలేదని, సీఎం కార్యాలయంలో పెండింగ్ లో ఉంచారనే ప్రచారం జరుగుతోంది.

కౌశిక్ పై అనేక పోలీస్ స్టేషన్ లో కేసు పెండింగ్ లో ఉన్నట్లు కెసిఆర్ కు సమాచారం అందడంతోనే అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుని, ఎటువంటి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడే గవర్నర్ ఆమోదానికి పంపించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హుజురాబాద్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి పోటీ చేశారు.ఆ సమయంలో ఆయనపై ఇల్లందకుంట, సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారు.అలాగే వీణవంక , హుజురాబాద్ టౌన్, కరీం నగర్ , జమ్మికుంట, సిరిసిల్ల తదితర పోలీస్ స్టేషన్ పరిధి లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

Telugu Etela Rajendar, Hujurabad, Koushik Reddy, Mlc Koushika, Telangana-Telugu

వాహనం పార్కింగ్ విషయంలో తమ బంధువులపై కౌశిక్ దాడి చేశారని 2019 ఫిబ్రవరిలో సినీనటి జీవిత రాజశేఖర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.కౌశిక్ రెడ్డి మీద ఉన్న కేసుల వివరాలను , వాటి పర్యవసానాలను అన్నిటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాతనే ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాల్సిందిగా గవర్నర్ కు ఫైల్ పంపించాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారట.ఈ నేపథ్యంలోనే ముందు ముందు ఎటువంటి వివాదాలు తలెత్తకుండా కేసీఆర్ జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.గతంలో మహారాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను నామినేట్ చేయడంపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో ఇంకా పెండింగ్ ఉంది.

అలాగే  తెలంగాణలోనూ గవర్నర్ కోటాలో గోరేటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్ లను నామినేట్ చేయడంపై గోపాల్ రావు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించడం తదితర కారణాలతో కౌశిక్ ఎమ్మెల్సీ పదవి వెయిటింగ్ లో పడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube