కోనసీమ అల్లర్ల కేసులు ఎత్తివేత ! వారికి జగన్ ఏం చెప్పారంటే ..?

కోనసీమ జిల్లాను( Konaseema district ) బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చడం పై కొద్ది నెలల క్రితం అమలాపురం( Amalapuram )లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో అనేక మందిపై కేసులు నమోదయ్యాయి .ఈ పేరు మార్పును నిరసిస్తూ ఆందోళనలు అల్లర్లు జరిగాయి.

 Cases Of Konaseema Riots Are Lifted , What Did Jagan Tell Them ,jagan,ap Cm Jaga-TeluguStop.com

పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కొద్దిరోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు జరిగాయి .అప్పట్లో వీటిపై అనేక మందిపై కేసులు నమోదయ్యాయి.

తాజాగా ఈ కేసులన్నిటిని ఎత్తివేస్తూ ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు ఈ రోజు వివిధ సామాజిక వర్గాల నాయకులతో జగన్ తాజాగా సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా ఆ కేసులను ఎత్తు వేస్తున్నట్లు జగన్ ప్రకటించారు.అన్నదమ్ముల వలె అంతా కలిసిమెలిసి జీవిస్తూ ఒకటవుదామని,  భావోద్వేగాల మధ్య కొన్ని ఘటనలు జరిగినప్పుడు వాటిని మరిచిపోయి మీరంతా కలిసిమెలిసి జీవించాలని జగన్ సూచించారు.

అందరం కలిసికట్టుగా ఒకటవుదామని, అందరిని ఏకం చేయడం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నామని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.తరతరాలుగా అదే ప్రాంతంలో కలిసిమెలిసి జీవిస్తున్నారని , అక్కడే పుట్టి అక్కడే పెరిగి జీవిత చరమాంకం  వరకు అక్కడే ఉంటారని,  రేపటి తరాలు కూడా అక్కడే జీవించాలి.

భావోద్వేగాల మధ్య కొన్ని ఘటనలు జరిగినప్పుడు వాటిని మరిచిపోయి అంతా కలిసిమెలిసి జీవించాలని జగన్ సూచించారు.

ఇకపై అదేవిధంగా ముందుకు సాగుతామని కోనసీమ కు చెందిన కాపు – శెట్టి బలిజ నేతలు హామీ ఇచ్చారు.యువకుల భవిష్యత్తు,  వారి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ పెద్దమనసుతో కేసులు ఎత్తివేసారని జగన్ కు కాపు , శెట్టి బలిజ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.శెట్టిబలిజ  వర్గానికి గతంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనన్ని పదవులు ఇచ్చి జగన్ గౌరవించారని , పెద్ద మనసుతో కేసులు ఉపసంహరించి మరింత సాయం చేశారని వారు పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube