టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.చంద్రబాబు స్కామ్ లు చాలా ఉన్నాయని తెలిపారు.
ఆధారాలు ఉన్నాయి కాబట్టే కేసులు పెట్టారని సజ్జల పేర్కొన్నారు.ఉచిత ఇసుక అన్నారు, కానీ ఎక్కడైనా ఉచితంగా ఇసుక దొరికిందా అని ప్రశ్నించారు.
ఉచిత ఇసుక అంటే ఎవరికి వాళ్లు తెచ్చుకోవాలన్నారు.కానీ పెద్ద పెద్ద ప్రొక్లెయినర్లు పెట్టి దందా చేశారని మండిపడ్డారు.
ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము నొక్కేశారని ఆరోపించారు.ప్రస్తుతం ఇసుకపై ఏడాదికి రూ.765 కోట్లు ప్రభుత్వానికి వస్తుందన్నారు.గతంలో ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
అనంతరం పురంధేశ్వరి మీద ధ్వజమెత్తిన సజ్జల ఆమె రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలా? లేక టీడీపీకి ఉపాధ్యక్షురాలా అని ప్రశ్నించారు.