కర్నూలులో టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన కేసు.. ?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార పార్టీ అయిన వైసీపీ ప్రభుత్వం పై మితిమీరిన ఆరోపణలు చేస్తున్న విషయం విదితమే.ఆ నోటి దురుసుతో మరొక సారి జారిన మాట సంచలనంగా మారిందట.

 Case Registered On Tdp Chief Chandrababu In Kurnool-TeluguStop.com

దీని ఫలితంగా కేసును కూడా నమోదు చేశారట.

ఆ వివరాలు తెలుసుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా నేపథ్యంలో ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తున్నారంటూ సుబ్బయ్య అనే న్యాయవాది కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు కాగా కర్నూలులో ఎన్440 కే వైరస్ ఉందంటూ ప్రజల్లో భయం కలిగేలా వ్యాఖ్యానిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొంటూ చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు.

 Case Registered On Tdp Chief Chandrababu In Kurnool-కర్నూలులో టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన కేసు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నేపధ్యంలో న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదును స్వీకరించిన కర్నూలు వన్ టౌన్ పోలీసులు, చంద్రబాబుపై 188, 505/1/బి/2, 54 సెక్షన్లు, 2005 ప్రకృతి వైపరిత్యాల చట్టంలోని జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసు నమోదు చేశామని వెల్లడించారట.ఇకపోతే చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారం పై వైసీపీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.

#TDP Chief #Kurnool #Chandrababu #Case Registered

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు