భూధాన్ భూముల వివాదంపై కేసు నమోదు.

Case Registered On Bhudhan Land Dispute.

సూర్యాపేట జిల్లా:కోర్టు ఆదేశాల మేరకు మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని భూదాన్ భూముల వివాదంపై కీర్తి సిమెంట్,మైహోమ్స్ యాజమాన్యాలు సహా ఐదుగురు ప్రభుత్వాధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని మేళ్లచెర్వు ఎస్ఐ తెలిపారు.నిందితులపై ఐపిసి సెక్షన్ 120(బి),420, 379,417,418,468,504,506,191,201,r/w 34,సెక్షన్ 3 ఆఫ్ పిడిపిపి యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు.ఇందులో ఏ1 జాస్తి త్రివేణి, ఏ2 జాస్తి శేషగిరిరావు,ఏ3 జె.శ్రీనివాస్,ఏ4మునగాల రామ్మోహన్ రావు,ఏ5 ఎన్.శ్రీనివాసరావు,ఏ6 కె.నాగేశ్వరావు,ఏ7 మేళ్లచెరువు తహశీల్దార్ కొల్లు దామోదర్,ఏ8 మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్,ఏ9 మేళ్లచెరువు గ్రామపంచాయతీ కార్యదర్శి ఈర్ల నారాయణరెడ్డి,ఏ10 ఇరిగేషన్ ఈఈ కె.శ్రీనివాస్, ఏ11 విద్యుత్ శాఖ మేళ్లచెరువు ఏఈలను ఎఫ్ఐఆర్ లో చేర్చి,ఎఫ్ఐఆర్ నెం:149/2022 గా కేసు నమోదు చేసి,కేసు పత్రాలు కోర్టుకు సమర్పించడం జరిగిందన్నారు.ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు జరుగుతుందని,దర్యాప్తు అనంతరం కోర్టు ఆదేశాలతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

 Case Registered On Bhudhan Land Dispute.-TeluguStop.com

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube