బెట్టింగుల్లో నష్టపోయారట... అందుకే కేసు పెట్టారు  

Case Registered Against Lagadapati-chandrababu Naidu,lagadapati,tdp,ys Jagan

బెట్టు కట్టడం అనేది నేరం అలాంటిది బెట్టు కట్టి మేము నష్టపోయాం అంటూ ఒక న్యాయవాది కేసు పెట్టారు. ఇంతకీ ఆ బెట్టింగ్ ఏంటంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందా,వైసీపీ గెలుస్తుందా అని తెగ బెట్టింగులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వే ను నమ్ముకొని చాలా మంది బెట్టింగులు నిర్వహించారు..

బెట్టింగుల్లో నష్టపోయారట... అందుకే కేసు పెట్టారు-Case Registered Against Lagadapati

ఈ క్రమంలో రాజగోపాల్ సర్వే ప్రకారం చాలా మంది టీడీపీ గెలుస్తుంది అని బెట్టు కట్టరట. దీనితో ఎన్నికల ఫలితాలు ఏమో తారు మారు కావడం తో ఇప్పుడు కొవ్వూరు కు చెందిన మురళి కృష్ణ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేసారు.

ఎన్నికల ఫలితాలకు ముందు లగడపాటి విడుదల చేసిన సర్వే వల్ల అనేక మంది బెట్టింగ్‌ల్లో నష్టపోయారని పేర్కొంటూ కొవ్వూరు పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

లగడపాటి సర్వేల వెనుక అంతర్జాతీయ బెట్టింగ్‌ మాఫియా ఉందని అనుమానం వ్యక్తం చేసిన మురళీకృష్ణ. నిజానిజాలు తేల్చాలని తన ఫిర్యాదులో కోరినట్లు తెలుస్తుంది..