గూగుల్ సీఈఓ పై కేసు నమోదు..?!

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పై భారత్​లో కేసు నమోదైంది.కాపీరైట్ చట్టం ఉల్లంఘన కింద ముంబయిలో ఈ కేసు నమోదు చేశారు పోలీసులు.

 Case Registered Against Google Ceo , Google Ceo, Case, Sundar Pichai, Google,-TeluguStop.com

ఆయనతో పాటు మరో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.కాపీరైట్ యాక్ట్ 1957లోని 51,63,69 సెక్షన్ల కింద కేసు బుక్ చేసినట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.ఏక్ హసీనా థీ ఏక్ దీవానా థా అనే సినిమాను తన అనుమతి లేకుండా యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారంటూ ఆ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ సునీల్ దర్శన్ కాపీరైట్ చట్టాల ఉల్లంఘన కారణంతో ముంబయి కోర్టును ఆశ్రయించారు.

 Case Registered Against Google CEO , Google Ceo, Case, Sundar Pichai, Google, -గూగుల్ సీఈఓ పై కేసు నమోదు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గూగుల్ సీఈఓతో పాటు అందుకు బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకోవాలని పిటీషన్ లో అభ్యర్థించారు.పిటిషన్​పై సానుకూలంగా స్పందించిన కోర్టు గూగుల్ సీఈఓ సుందర్​ పిచాయ్​ సహా ఆ సంస్థకు చెందిన ఐదుగురు అధికారులపై ఎఫ్​ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

ఈ సందర్భంగా సునీల్ దర్శన్ మాట్లాడుతూ.ఆ ఏక్ హసీనా థీ ఏక్ దీవానా థా సినిమా రైట్స్ ని ఎవరికీ అమ్మలేదని, యూట్యూబ్ లో దాన్ని అప్లోడ్ చేయడం వల్ల తనకు భారీ నష్టం వాటిల్లిందని సునీల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనిపై యూట్యూబ్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా వారి నుండి ఎటువంటి స్పందన లేదని.అందుకే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు.

దీంతో.కాపీరైట్ యాక్ట్ 1957లోని 51, 63, 69 సెక్షన్ల కింద కేసు బుక్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే కేంద్ర ప్రభుత్వం నిన్న (మంగళవారం) సుందర్ పిచాయ్​కు పద్మ భూషణ్ ప్రకటించింది.మరుసటి నాడే ఆయనపై కాపీరైట్ ఉల్లంఘన కింద కేసు నమోదవడం గమనార్హం.2017 లో రిలీజైన ఏక్ హసీనా థీ ఏక్ దీవానా థా మూవీ డిజాస్టర్ గా నిలిచింది.

Case Registered Against Google CEO , Google Ceo, Case, Sundar Pichai, Google, - Telugu Google, Google Ceo, Sundar Pichai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube