మరో టీడీపీ కీలక నేత పై కేసు నమోదు..!!

Case Registered Against Another Tdp Key Leader

ఇటీవల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి… ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఏకవచనంతో.విమర్శలు చేయటం తెలిసిందే.

 Case Registered Against Another Tdp Key Leader-TeluguStop.com

దీంతో పట్టాభి పై కేసు నమోదు కావడం మాత్రమే కాక ఆయనను జైల్లో కూడా పెట్టడం జరిగింది.ఆ తర్వాత బెయిల్ పై విడుదలైన పట్టాభి… కుటుంబంతో మాల్దీవుల పర్యటన లో ప్రస్తుతం ఉన్నారు.

ఇలా ఉంటే తాజాగా మరో తెలుగుదేశం పార్టీ కీలక నేత పై కేసు నమోదు చేయడం జరిగింది.

 Case Registered Against Another Tdp Key Leader-మరో టీడీపీ కీలక నేత పై కేసు నమోదు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విషయంలోకి వెళ్తే టిడిపి ప్రధాన కార్యాలయం పై పార్టీ కీలక నేతపై జరిగిన దాడిని నిరసిస్తూ.చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష కార్యక్రమంలో..

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా.సీఎం జగన్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పై కేసు నమోదు అయింది.

అంతకుముందు పట్టాభి చేసిన వ్యాఖ్యలనే మళ్లీ బోండా ఉమ దీక్ష సమయంలో… మళ్లీ రిపీట్ చేయటంతో గుంటూరులో వైసీపీ నేతలు పోలీస్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.పట్టాభి అన్నట్టే రాష్ట్రంలో పేద వర్గాలు కూడా జగన్ పరిపాలన ఉద్దేశించి బోసిడికే పరిపాలన మాదిరిగా ఉందని అంటున్నట్లు చంద్రబాబు దీక్ష సమయంలో బోండా ఉమా ఈ కామెంట్ చేయడం జరిగింది.

దీంతో బోండా ఉమ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.గుంటూరు వైసీపీ నాయకులు పోలీస్ ఫిర్యాదు చేయడంతో బోండా ఉమా పై కేసు నమోదయింది.

#AP #Chandra Babu #AP #Bonda Uma #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube