చిలుకమ్మా చిటుకేసింది.. ఓనర్ పై కేసు పడింది!

రామ చిలుకలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి.వాటి చిలుక పలుకులు ముచ్చట తెప్పిస్తాయి.

 Case Lodged Against Parrot Owner As The Bird Whistled Too Much In Pune Maharastr-TeluguStop.com

వాటికి చక్కగా పేర్లు, ఇతర పదాలు, మాటలు నేర్పిస్తే చక్కగా పలుకుతాయి కూడా.దాని పలుకులు వింటుంటే భలే సరదాగా అనిపిస్తుంది.

చాలా మంది చిలుక పలుకులు వినేందుకు ఇష్టపడుతుంటారు.కానీ ఆ వ్యక్తికి మాత్రం చిలక పలుకులు అంటే చిరాకు.

అది మాట్లాడుతుంటేనే విసుక్కుంటాడు.అందుకే కేసు పెట్టాడు.

ఎవరా వ్యక్తి.ఎందుకు కేసు పెట్టాడు.

ఎవరిపై కేసు పెట్టాడో తెలుసుకోవాలని ఉందా.

ఓపెన్ చేస్తే అది మహారాష్ట్ర రాష్ట్రంలోని పుణె నగరం.అక్కడి శివాజీ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు సురేష్ శిందే.72 ఏళ్ల వృద్ధుడు సురేష్ శిందే.జీవిత చరమాంకంలో ప్రశాంతంగా జీవించాలనుకున్నాడు.కానీ ఉండలేకపోయాడు.

చెవిలో ఎప్పుడూ ఒకటే గోల.ఒక రోజు, రెండు రోజులు కాదు రోజూ అదే గోల.ఏంటీ ఈ కాకి గోల అనుకున్నాడు.పక్కింట్లో ఉండి కాకి గోల చేసేది.

రామ చిలుక అని తెలుసుకున్నాడు.దానిని అక్బర్ అంజద్ ఖాన్ అనే వ్యక్తి ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నాడు.

చాలా గారాబంగా చూసుకుంటున్నాడు.రోజూ పండ్లు ఫలాలు తెచ్చి దానికి పెడుతున్నాడు.

అది పంజరంలో ఉండి అరుస్తుంటే ముచ్చటపడుతున్నాడు.రోజూ రామ చిలుక అరుపులు పక్క ఇంట్లో ఉన్న సురేష్ శిందేకు ఇబ్బంది పెట్టినట్లున్నాయి.

అంతే ఖడ్కే పోలీసు స్టేషన్ కు వెళ్లి దాని ఓనర్ అక్బర్ అంజద్ ఖాన్ పై ఫిర్యాదు చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube