కమల్‌పై ఢిల్లీ కోర్టులో కేసు  

Case Filed On Kamla Hasan కమల్‌-elections 2019,hindhu,kamal Haasan,modi,tamilanadu,కమల్ హాసన్,తమిళనాడు

హిందూ ఉగ్రవాదం గురించి మాట్లాడి విమర్శలపాలైన కమల్‌ హాసన్‌ పై కేసు కూడా నమోదు అయ్యింది. అంతా అనుకుంటున్నట్లుగానే పలు పోలీస్‌ స్టేషన్‌లలో మరియు కోర్టుల్లో బీజేపీకి చెందిన వారు మరియు కమల్‌ వ్యతిరేక వర్గీయులు పెద్ద ఎత్తున కేసులు పెడుతున్నారు. ఈ కేసులతో కమల్‌ హాసన్‌ చిక్కుల్లో పడ్డట్లయ్యింది..

కమల్‌పై ఢిల్లీ కోర్టులో కేసు-Case Filed On Kamla Hasan కమల్‌

కమల్‌ హాసన్‌ వ్యాఖ్యలను ఏమాత్రం సమర్ధించలేం అంటూ మొదటి నుండి హిందూ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. ఇక తాజాగా ఢిల్లీ కోర్టులో కమల్‌ వ్యాఖ్యలపై కేసు నమోదు అయ్యింది. విచారణకు కూడా కోర్టు అంగీకారం తెలియజేయడంతో ప్రస్తుతం కమల్‌ మరింత చిక్కుల్లో పడ్డట్లయ్యింది.

స్వాతంత్య్ర భారతావణిలో మొదటి ఉగ్రవాది హిందువు అంటూ కమల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దుమారంను రేపుతున్నాయి. దేశంలోని ముస్లీం ఓటర్లను తనవైపుకు తిప్పుకునే ఉద్దేశ్యంతో కమల్‌ ఈ వ్యాఖ్యలు చేశాడంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక హిందూ సంఘాల నాయకులు ఏకంగా కమల్‌ నాలుక కోసేయాలంటూ సీరియస్‌గా స్పందిస్తున్నారు.

మొత్తాకిని కమల్‌ పెద్ద చిక్కుల్లోనే పడ్డాడు. దీని నుండి ఎలా బయట పడతాడో చూడాలి.