లంచగొండి ఓటర్ పై సుప్రీం కోర్ట్ విచారణ! ఇకపై శిక్షలు తప్పవా  

లంచాగోడి ఓటర్స్ పై కేసు విచారణ చేపట్టనున్న సుప్రీం కోర్ట్. .

Case File On Corrupted Voters In Supreme Court-

ఇండియాలో ఎన్నికలు అంటే డబ్బు ప్రవాహం ఉండాల్సిందే.లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే రాజకీయ నాయకులు ప్రజలకి డబ్బులు పంచడానికి కోట్ల రూపాయిలు సిద్ధం చేసుకోవాల్సిందే.పార్టీ అభ్యర్ధులు డబ్బులు ఇస్తామని ఇవ్వకపోతే వేరొక పార్టీకి ఓటేయడానికి ఓటర్స్ ఏ మాత్రం ఆలోచించడం లేదు..

Case File On Corrupted Voters In Supreme Court--Case File On Corrupted Voters In Supreme Court-

డబ్బు ఇవ్వకపోతే ఓటేయం అనే స్థాయిలో లంచంకి ఓటర్స్ అలవాటుపడిపోయారు.రాజకీయ నాయకులు కూడా వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని మాకు ఓటేయండి అని పరోక్షంగా లంచం ఇస్తారు తీసుకోండి అని ప్రజలకి ఆశ పెడుతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో చట్టవిరుద్ధంగా లంచం తీసుకునే ఓటర్లను విచారించేందుకు భారత ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై ఈ నెల 22న విచారణ జరుపుతుంది.కర్ణాటకలోని లంచ ముక్త కర్ణాటక నిర్మాణ వేదికె ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.ఓటు వేయడానికి డబ్బులు అడగడం లంచం తీసుకోవడం లాంటిదే అని దానిని పెద్ద నేరంగా పరిగణించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.దీనిపై సుప్రీం కోర్ట్ ఎం చెబుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.