కేసీఆర్‌ను తిట్టినందుకు ఆమెపై కేసు నమోదు  

Case File On Banoth Lakshmi-farmmers In Roads,telangana Cm Kcr,uriya

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పరుష పదజాలంతో తిట్టినందుకు గాను జగిత్యాల జిల్లాకు చెందిన బానావత్‌ లక్ష్మీ అనే మహిళ రైతుపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.ఈనెల 3వ తారీకున యూరిక కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులు రోడ్డు ఎక్కారు.రైతుల ఆందోళన తీవ్ర స్థాయిలో మారింది.ఆ సమయంలోనే మహిళ రైతు లక్ష్మీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది..

Case File On Banoth Lakshmi-farmmers In Roads,telangana Cm Kcr,uriya-Case File On Banoth Lakshmi-Farmmers In Roads Telangana Cm Kcr Uriya

ఆ సమయంలో ఆమె బూతులు కూడా మాట్లాడటంతో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తీవ్ర మనస్థాపంకు గురయ్యారట.

తాజాగా జిల్లా పార్టీ నాయకులు లక్ష్మీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.తమ ప్రియతమ నాయకుడిపై ఆమె చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయని, అందుకే ఆమెపై కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్పందించి కేసు నమోదు చేయడం జరిగింది.

లక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యక్తిగత పూచికత్తుపై విడిచి పెట్టారు.కేసు కంటిన్యూ అవుతోంది.పోలీసుల విచారణలో ఆమె తప్పు చేసినట్లుగా వెళ్లడయితే కోర్టు ఆమెకు నెల నుండి మూడు నెలల వరకు శిక్ష విధించే అవకాశం ఉందని న్యాయ నిఫుణులు చెబుతున్నారు.