పాపం ఎమ్మెల్యే సరుకులు పంచాలనుకుంటే కేసు నమోదు అయ్యింది  

Case File Against Chattishgrah Mla Sailesh Pandy - Telugu 144 Section In Chatishgarh, Chatishgarh Mla Sailesh Pandy, India Lock Down, Police Lathi Charge

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉన్న కారణంగా పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రతి రోజు పని చేసుకుంటే తప్ప తిండి కూడా ఉండని వారు ఎంతో మంది ఉన్నారు.

 Case File Against Chattishgrah Mla Sailesh Pandy

వారందరికి కూడా ఇప్పుడు ప్రభుత్వం సాయం చేసేందుకు సిద్దం అయ్యింది.ఇదే సమయంలో కొందరు మనసున్న మంచి వారు కూడా ముందుకు వచ్చి సాయంను ప్రకటిస్తున్నారు.

కొందరు నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు.చత్తీస్‌గఢ్‌కు చెందిన ఎమ్మెల్యే శైలేష్‌ పాండే కూడా తన ఇంటి వద్ద పేదలకు సరుకులు పంపిణీ చేసేందుకు సిద్దం అయ్యాడు.

పాపం ఎమ్మెల్యే సరుకులు పంచాలనుకుంటే కేసు నమోదు అయ్యింది-General-Telugu-Telugu Tollywood Photo Image

ఎమ్మెల్యే తన నివాసం వద్ద సరుకులు పంపిణీ చేస్తున్నట్లుగా విషయం తెలిసిన పేదలు వేలాది మంది ఆయన ఇంటికి చేరుకున్నారు.144 సెక్షన్‌ ఉన్న ఈ సమయంలో వేలాది మంది గుమ్మిగూడేలా చేసిన ఎమ్మెల్యేపై కేసు నమోదు అయ్యింది.ఆయన పరిస్థితిని ఊహించకుండా మంచి మనసుతో సాయం చేయాలనుకున్నా కూడా ఇలా కేసుల పాలయ్యాడు అంటూ స్థానికులు చెబుతున్నారు.పోలీసులు వచ్చి లాఠీ చార్జ్‌ చేయడంతో సరుకుల పంపిణీ పూర్తిగా కాకుండానే జనాలు అక్కడ నుండి వెళ్లి పోయారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..