బాలీవుడ్ నటుడిపై కేసు.. అతని ప్రవర్తనే దీనికి కారణమట..?

మంచి ప్రవర్తన మనిషిని ఉన్నతంగా నిలబెడుతుందన్న విషయం తెలిసిందే.ఎవరైన సరే ఆప్యాయంగా పలకరిస్తే పొంగిపోని మనిషి అంటూ ఈ లోకంలో ఉండరు.

 Bollywood Actor, Mahesh Manjrekar, Car Driver, Slap, Police Case, Case Against B-TeluguStop.com

మన మాటతీరు, ఎదుటి వారిలో మంచి భావం కలిగిస్తుంది.అదే మాటతీరు చెడ్దవారిగా చిత్రిస్తుంది.
అయితే సెలబ్రెటీలు అన్నాక అభిమానుల వల్ల చిక్కులు, విసుగు రావచ్చూ.ఒక్కో సారి అనుకోని ఊహించని విధమైన సంఘటనలు జరగవచ్చూ.ఇలాంటి సమయాల్లో అతికోపం మాత్రం పని చేయదు అని నిరూపించిన ఘటన ఇప్పుడు మనం తెలుసుకోబోయేది.ఆ వివరాలు చూస్తే.

తెలుగులో ఒక్కడున్నాడు, హోమం, అదుర్స్ వంటి చిత్రాల్లో విలన్‌గా నటించన నటుడు మహేశ్ మంజ్రేకర్ శుక్రవారం రాత్రి తన కారులో పుణే నుంచి షోలాపూర్ వెళుతున్న సమయంలో ఆ కారును నడుపుతున్న కైలాశ్ సత్పుతే అనే డ్రైవరు ఒక చోట సడెన్ బ్రేక్ వేయగా అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో కారు వీరి కారును ఢీ కొట్టగా మహేశ్ మంజ్రేకర్ కారు స్వల్పంగా డ్యామేజ్ అయిందట.

దీంతో మహేశ్ మంజ్రేకర్ పట్టరాని ఆగ్రహంతో డ్రైవర్ కైలాశ్ సత్పుతేపై చేయి చేసుకోవడమే కాకుండా బూతులు తిట్టారట.

అత్మాభిమానం దెబ్బతిన్న ఆ డ్రైవరు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి మహేశ్ మంజ్రేకర్ పై ఫిర్యాదు చేయడంతో ఆ డ్రైవరు ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube