కుదిపేస్తున్న కరోనా ! అక్కడ మాత్రం ప్రశాంతం

వెళ్ళిపోయింది అనుకున్న కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ గతంతో పోలిస్తే మరింత బలంగా, వేగంగా జనాల పై దాడి చేస్తోంది.సరిగ్గా గతేడాది ఇదే సమయంలో కరోనా వైరస్ ఉద్ధృతంగా ఉంది.

 Carona Virus Spred In India Very Fastly-TeluguStop.com

లాక్ డౌన్ సైతం అప్పుడు అమల్లో ఉంది.కేసుల సంఖ్య బాగా తగ్గిపోయింది అనుకుంటున్న సమయంలో మళ్లీ తీవ్రతరం అయ్యింది.

ఇప్పుడు చూస్తే కరోనా గతం కంటే చాలా తీవ్రంగా ఉంది.కేసుల సంఖ్య గతంతో పోలిస్తే బాగా పెరిగిపోతున్నాయి.

 Carona Virus Spred In India Very Fastly-కుదిపేస్తున్న కరోనా అక్కడ మాత్రం ప్రశాంతం-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.అయినా మళ్ళీ లాక్ డౌన్ విధించాలనే ఆలోచన కేంద్రానికి లేదు .గతేడాది లాక్ డౌన్ సమయంలో చోటు చేసుకున్న అపశృతి లను మళ్లీ గుర్తు చేసు కుంటున్న కేంద్రం, ఈసారి అటువంటి పొరపాటుకు ఆస్కారం ఇవ్వకూడదు అనే ఆలోచనతో, అయా రాష్ట్రాలకే  లాక్ డౌన్ అమలు చేసే నిర్ణయాన్ని వదిలేసింది.

దీంతో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లాక్ డౌన్ నిబంధనలు అమలు చేసుకుంటున్నాయి.

ప్రస్తుతం ఎక్కడికక్కడ కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరిగి పోతున్నాయి.అయితే ఆయా రాష్ట్రాలు ,  కేంద్రం విడుదల చేస్తున్న లెక్కలకు,  నమోదవుతున్న కేసులకు , మరణాలతో సంబంధం లేదన్నట్లుగానే పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో , ఆ ఎన్నికలకు ఆటంకం కలగకూడదు అనే ఆలోచనతో కేంద్రం ఉంది.అయితే మరణాల శాతం రోజురోజుకూ తీవ్రతరం అవుతున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

  కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉండడం, వ్యాక్సిన్ చేయించుకున్న వారికి ఈ వైరస్ లక్షణాలు బయట పడుతుండడం వంటి వ్యవహారాలు ఆందోళన కలిగిస్తున్నాయి .

మరోసారి దేశవ్యాప్తంగాలాక్ డౌన్నిర్వహించే ఆలోచనలో కేంద్రం లేదు.కానీ అన్ని రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాయి.మాస్కు పెట్టుకోని వారికి భారీ జరిమానా విధిస్తూ,  ఈ వైరస్ తీవ్రత ఏ విధంగా ఉంది అనే ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా చేస్తున్నాయి.

  ఇదిలా ఉంటే ఈ వైరస్ ను ప్రపంచానికి అంటించిన చైనా మాత్రం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది .  అక్కడ కేసుల సంఖ్య ఏ విధంగా ఉన్నాయి ? చైనాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుందా లేదా ఇలా ఏ విషయాలను ప్రపంచానికి తెలియనివ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.కేవలం భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ ప్రభావం తీవ్రతరం అవుతుండడంతో,  అన్ని దేశాలు ఈ వైరస్ విషయంలో టెన్షన్ పడుతున్నాయి.

#Carona Virus #Covid Vacsin #India #Elections #China

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు