కరోనా వైరస్ కి వాక్సిన్! భారతీయ శాస్త్రవేత్త కృషి

చైనా దేశాన్ని అతలాకుతలం చేసిన ప్రపంచ దేశాలని సైతం భయపెడుతున్న వైరస్ కరోనా.ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు భయంతో నిద్రపోవడం లేదంటే అతిశయోక్తి కాదు.

 Carona Vaccine Ss Vasan-TeluguStop.com

దీనికి విరుడుగు కనుక్కోవడానికి అన్ని దేశాలు విస్తృత పరిశోధనలు మొదలుపెట్టాయి.మరో వైపు చైనాకి సమీపంలో ఉన్న భారత్ లాంటి దేశంలో కరోనా వైరస్ ఆనవాళ్ళు కనిపించడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది.

ఇది విస్తరించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇక చైనాలలో ఇప్పటికి ముప్పై వేలకి పైగా కరోనా వైరస్ భారిన పడ్డట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు దీనికి వాక్సిన్ కనుక్కొన్నట్లు తెలుస్తుంది.

భారతీయ సంతతి శాస్త్రవేత్త ఎస్ఎస్ వాసన్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా బృందం వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ కనిపెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ హై సెక్యూరిటీ ల్యాబ్‌ పరిశోధనల్లో కరోనాకు విరుగుడు కనిపెట్టినట్లు తెలుస్తోంది.సీఎస్ఐఆర్ఓ పరిశోధకుల ప్రాథమిక అధ్యయనంలో వైరస్ పెరుగుదలను గుర్తించారు.

ఈ వ్యాక్సిన్‌ గురించి వాసన్ మాట్లాడుతూ రక్త నమూనాల నుంచి వైరస్‌ను డోహెర్టీ ఇన్‌స్టిట్యూట్ ఉద్యోగులు వేరు చేశారని తెలిపారు.ఈ సమాచారాన్ని తమకు అందజేసిన డోహెర్టీ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.

అభివృద్ధి దశలో ఉన్న వ్యాక్సిన్.వైరస్ సోకినవారిపై ప్రయోగించి, వ్యాక్సిన్‌ సమర్ధతను పరీక్షిస్తామని, వేగంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నామని వాసన్‌ తెలిపారు.

కరోనా వైరస్ శ్వాసకోసాలలో ఎలా వ్యాప్తి చెందుతుందో గుర్తించామని దీనిని నిరోధించడానికి సమర్దవంతంగా పనిచేసే వాక్సిన్ ని అందుబాటులోకి తెస్తామని వాసన్ చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube