కరోనాతో కంగారు... షిప్ ని ఆపేసిన జపాన్

కరోనా వైరస్ పేరు వింటేనే ఇప్పుడు అన్ని దేశాలు హడాలిపోతున్నాయి.ఆ వైరస్ తమ దేశంలోకి ఎక్కడ వస్తుందో, ఎక్కడ సమస్యగా మారుతుందో అనే టెన్షన్ పడుతున్నారు.

 Carona Japan China Boat-TeluguStop.com

దానిని దేశంలోకి రాకుండా చేయడానికి అన్ని దేశాలు వారి వారి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా వైరస్‌ ప్రభావం వల్ల చైనా భూభాగంతో ఉన్న 13 సరిహద్దు క్రాసింగ్స్‌ను హాంకాంగ్ మూసివేసింది.

పలు విమానయాన సంస్థలు కూడా చైనాకి సర్వీసులని నిలిపేసాయి.ఇదిలా ఉంటే తాజాగా జపాన్ మూడు వేల మందికి పైగా ఉన్న నౌకకి ఒడ్డుకి రాకుండా తీరంలోనే ఆపేసింది.

జపాన్‌కు చెందిన డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ నౌకలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరికి కరోనా వైరస్ సోకింది.దీంతో అప్రమత్తం అయిన జపాన్ ప్రభుత్వం యొకోహామా తీరంలోనే నౌకను ఆపేసింది.

ఆ నౌకలో ఏకంగా 3700 మందికి పైగా ఉన్నారు.జపాన్‌ నిర్ణయంతో ప్రయాణికులంతా 24 గంటలపాటు నౌకలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

ప్రయాణికులందరికీ వైద్యపరీక్షలు పూర్తయ్యాక మాత్రమే అక్కడ నుంచి అనుమతిస్తామని అధికారులు చెప్తున్నారు.దీంతో అక్కడికి చేరుకున్న వైద్యులు నౌకలోని 80 ఏళ్ల ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు గుర్తించారు.

ఆ వ్యక్తిని వెంటనే హాస్పిటల్ కి తరలించి మిగిలిన ప్రయాణికులకి వైద్య పరీక్షలు చేసిన తర్వాత అనుమతించారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube