కరోనా ఎఫెక్ట్ : ముద్దు సీన్లలో నటించమంటున్న హీరోయిన్లు...

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎంత కలకలం సృష్టిస్తుందో పెద్దగా చెప్పనవసరం లేదు.ఇప్పటికే ఈ వైరస్ సోకి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 50 వేలు పైచిలుకు మందికి పైగా మరణించారు.

 Carona Effect In Hollywood China-TeluguStop.com

మరింత మంది ఈ వైరస్ లక్షణాలతో బాధ పడుతున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి.దీంతో ఈ  కరోనా  వైరస్ ఎఫెక్ట్ దాదాపుగా చైనాలోని అన్ని రంగాలపై పడినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం చైనాలోని పలు సినిమాల షూటింగులు ఆగిపోయినట్లు సమాచారం.ఎందుకంటే కరోనా వైరస్ ప్రభావం కారణంగా దాదాపుగా అన్ని బహిరంగ ప్రదేశాలలో మరియు టూరిస్టు ప్రాంతాలు కొంతకాలంగా బోసిపోతున్నాయి.

అంతేగాక సినిమా అంటే ముద్దు సీన్లు కామన్ గా  ఉంటాయి.అయితే కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల నటీనటులు కూడా ముద్దు సీన్లలో నటించేందుకు జంకుతున్నారు.దీంతో దర్శక నిర్మాతలు కూడా కొంతకాలం పాటు చిత్రాల షూటింగ్ వాయిదా వేస్తూ వస్తున్నారు.

Telugu China, Coronavirus, Heroins-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే పలు దేశాల నుంచి చైనా దేశానికి రాకపోకలు కొంతమేర నిలిపి వేసినట్లు తెలుస్తోంది.అంతేగాక ప్రయాణికులు కూడా చైనా దేశానికి ప్రయాణించాలంటే జంకుతున్నారు.ఈ కరోనా వైరస్ ప్రభావం చైనా టూరిజం రంగం పై బాగానే ప్రభావం చూపుతోంది.

ఇప్పటికే పలు ఎయిర్ లైన్  సంస్థలు ప్రయాణాలు లేకపోవడంతో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో చైనా ప్రభుత్వ అధికారులు ఈ మహమ్మారి వైరస్ కి వీలైనంత తొందరగా మందు కనిపెట్టాలని లేకపోతే ఈ వైరస్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడి తమ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube