కరోనా ఎఫెక్ట్... మద్యం లేక మతిస్థిమితం కోల్పోయి చివరికి అలా

కరోనా ప్రభావంతో దేశ ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయిపోయారు.నిత్యావసర వస్తువులు తప్ప మొత్తం వాణిజ్య, వర్తక సంస్థలు పూర్తిగా దెబ్బ తిన్నాయి.

 Hyderabad Man Suicide Due To Liquor Problem, Lock Down, Corona Virus, Hyderabad-TeluguStop.com

ఇక ఇండియాలో ఎక్కువ ఆదాయం తీసుకోచ్చేది మద్యం సిండికేట్.అయితే మద్యం షాపులని లాక్ డౌన్ నేపధ్యంలో పూర్తిగా దెబ్బతిన్నాయి.

దీంతో మద్యానికి బానిసైన వాళ్ళు మాత్రం ఈ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఏది దొరికిన మద్యం అనుకోని కొంత మంది తాగేస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాలలో సారా వినియోగం ఎక్కువ అయినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటె సిటీలలో మద్యం దొరకకపోవడంతో తాగుబోతులు ఇబ్బందులు వర్ణనాతీతం అని చెప్పాలి.

భాగ్యనగరానికి చెందిన ఓ వ్యక్తి మద్యం దొరక్క మతిస్థిమితం కోల్పోయాడు.భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన బంజారహిల్స్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 2లోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్న మధు అనే 55 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నారు.

పెయింటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.మధుకు రోజూ మద్యం తాగే అలవాటు ఉంది.

అయితే లాక్ డౌన్ కారణంగా గత నాలుగురోజులుగా ఎక్కడా మద్యం దొరకలేదు.దీంతో అతను మతి స్థిమితం కోల్పోయాడు.

శుక్రవారం ఉదయం ఇంట్లోంచి బయటకు వెళ్లి బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 10లోని జడ్జిస్‌ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు.అక్కడ నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మద్యానికి బానిసైన కేరళకు చెందిన 38 ఏళ్ల వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.మద్యం దొరక్కపోవడంతో మనస్తాపానికి గురై చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube