ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజ ఏదైనా గజగజ వణికిస్తుందా అంటే.అది కరోనా వైరస్ అనే చెప్పాలి.
ఎందుకంటే.ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచమంతా అత్యంత వేగంగా వ్యాపిస్తోంది.
ఈ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే మూడు వందలమంది మృతి చెందగా మరో 10 వేలమంది ఈ వైరస్ భారిన పడ్డారు.
అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది.
అలాంటి ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచంలోనే ఎక్కడా చేయనటువంటి.ఎక్కడ జరగనటువంటి ప్రయోగాన్ని చైనా చేస్తుంది.
ఆ ప్రయోగం తెలిశాక.ఇది ఇక్కడ కూడా జరుగుతుంది కదా! అని అనిపిస్తుంది.
కానీ ఇది ఇక్కడ జరగడం వేరు.చైనాలో జరగడం వేరు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.చైనాలో ఈ కరోనా వైరస్ రోజు రోజుకు దారుణంగా వ్యాపిస్తుంది.దీంతో ఉద్యోగులంతా భయపడి పోతున్నారు.ఆఫీస్ కు రావాలంటేనే వణికిపోతున్నారు.
అయినా సరే కొందరు వెళ్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఆ ఉద్యోగులకు అద్భుతమైన ఆఫర్ ఇచ్చాయి చైనా కంపెనీలు.
అది ఏంటి అంటే.కంపెనీకి రాకుండానే.ఇంట్లోనే కూర్చొని వర్క్ చెయ్యడం.దాన్నే ‘వర్క్ ఫ్రామ్ హోమ్’ అని అంటారు.
అయితే ఈ వర్క్ ఫ్రామ్ హోమ్ కాన్సెప్ట్ భారత్ లో కూడా ఉంది కానీ.ఇప్పుడు చైనాలో అది అమలు చేస్తే.
ప్రపంచంలోనే అతిపెద్ద ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రయోగంగా చైనా నిలవనుంది.