ముగిసిన కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2020 ... విజేత ఎవరంటే...?!

తాజాగా జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఎట్టకేలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ముగిసింది.ఇకపోతే ఈ సీజన్ లో కరీబియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ను ట్రైన్ బాగో నైట్ రైడర్స్ జట్టు ఒక్కసారి కూడా ఓడిపోకుండా టైటిల్ ను సొంతం చేసుకుంది.

 Trinbago Knight Riders Win Caribbean Premier League 2020,caribbean Premier Leagu-TeluguStop.com

ఇక ఫైనల్ మ్యాచ్ లో సెయింట్ లూసియా జూక్స్ జట్టుపై ట్రిన్ బాగో నైట్ రైడర్స్ విజయం సాధించింది.ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా జూక్స్ జట్టు మొదట భారీ స్కోరు దిశగా పరుగులు చేపట్టిన, ఆ తర్వాత బౌలింగ్ కు వచ్చిన కెవిన్ పోల్లర్డ్ వచ్చిన తర్వాత మ్యాచ్ మొత్తం స్వరూపాన్ని మార్చేశాడు.

పొలార్డ్ వచ్చే సమయానికి సెయింట్ లూసియా జూక్స్ జట్టు 9 ఓవర్లలో 77 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయి పటిష్ఠ స్థితిలో ఉన్న నేపథ్యంలో సులువుగా 180 పరుగులు చేసేలా కనిపించింది.అయితే ఆ తర్వాత పొలార్డ్ తో సహా మిగతా వాళ్లు కూడా కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో కేవలం 154 పరుగులకే ఆల్ అవుట్ అయింది.

ఇందులో కెవిన్ పొలార్డ్ నాలుగు ఓవర్లో 30 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసి సెయింట్ లూసియా పతనాన్ని శాసించారు.సెయింట్ లూసియా జట్టులో ఆండ్రీ ఫ్లెచర్ 27 బంతుల్లో 39 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఇక లక్ష్య ఛేదనకు వచ్చిన నైట్ రైడర్స్ ఆదిలోనే రెండు వికెట్లను కోల్పోయింది.దీంతో నైట్ రైడర్స్ జట్టు ఒకింత నిరాశ కనబడగా ఆ తర్వాత వచ్చిన బ్రావో తో కలిసి ఓపెనర్ సీమెన్స్ నిలకడగా ఆడుతూ విజయం వైపు బాటలు వేశారు.

మరోవైపు చేయాల్సిన చేయాల్సిన పరుగులు పెరుగుతూ ఉన్న మరోవైపు ఇద్దరు అద్భుతమైన భాగస్వామ్యాన్ని చేకూరుస్తూ చివరికి మరో వికెట్ కోల్పోకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు.దీంతో నైట్ రైడర్స్ కేవలం 18.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 157 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది.ఇక మూడో వికెట్ కి ఏకంగా 138 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

దీంతో నైట్ రైడర్స్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ను నాలుగోసారి గెలిచింది.అయితే ఇంతవరకు ఏ జట్టు సాధించలేని ఘనత నైట్ రైడర్స్ ఒక్క ఓటమి కూడా లేకుండా టైటిల్ ను సొంతం చేసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube