నేటి ఆధునిక కాలంలో డిప్రెషన్‌తో బాధ పడుతున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది.ఆర్థిక ఇబ్బందులు, కావాల్సిన వారు దూరం కావడం, పని ఒత్తిడి, పోషకాల లోపం, ఆత్మీయులు మృతి చెందటం ఇలా రకరకాల కారణాల వల్ల డిప్రెషన్‌కు గురవుతుంటారు.
దీని నుంచి ఎంత త్వరగా బయటపడితే ఆరోగ్యానికి అంత మంచిది.కానీ, చాలా మంది డిప్రెషన్ నుంచి ఎలా బయట పడాలో తెలియక అందులోనే మునిగిపోతూ ప్రాణాలను కోల్పోతున్నారు.
అయితే డిప్రెషన్‌ను నివారించడంలో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.
అలాంటి వాటిలో యాలకులు ఒకటి.
యాలకుల్లో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు డిప్రెషన్‌ను నివారించి మానసిక ప్రశాంతతను అందిస్తాయి.మరి యాలకులను ఎలా తీసుకోవాలి.? ఎప్పుడు తీసుకోవాలి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఒక గ్లాస్ వాటర్‌లో మూడు యాలకులను వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి.ఉదయాన్నే ఆ నీటిని బాగా మరిగించి గోరు వెచ్చగా అయిన తర్వాత సేవించాలి.

ఈ యాలకుల వాటర్‌ను రోజూ పరిగడుపున తీసుకుంటేఅందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ డిప్రషన్ నుంచి విముక్తిని కలిగిస్తాయి.ఆందోళన, తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు సైతం దూరం అవుతాయి.అలాగే యాలకుల నీటిని తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తగ్గి జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.

యాలకుల నీరు తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది .అందు వల్ల, ఎవరైతే మధుమేహం వ్యాధితో బాధ పడుతున్నారో వారు ప్రతి రోజూ పరిగడుపున యాలకుల నీరు తీసుకోవడం చాలా ఉత్తమం.అంతేకాదు, యాలకుల వాటర్‌ను తీసుకోవడం వల్ల చర్మం యవ్వనంగా మెరిసిపోతుంది.
వెయిట్ లాస్ అవుతారు.ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
మరియు క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గు ముఖం పడుతుంది.
