వైరల్: కారు ఎక్కిన సినీ అభిమానం..!

Car Riding Is A Movie Favorite

లెజెండరీ నటుడు, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.అయితే అందులో కొందరు డైహార్డ్ ఫాన్స్ కూడా ఉంటారు.

 Car Riding Is A Movie Favorite-TeluguStop.com

అలాంటి వాళ్లు చూపించే అభిమానం మనం మాటల్లో చెప్పలేకపోయినా.మన మనస్సును కదిలిస్తుంది.

అటువంటి డై హార్డ్ ఫ్యాన్ ఒకరు అమితాబ్ బచ్చన్ కోసం చేసిన పని తెలిస్తే ఆశ్చర్య పోతారు.ఇంతకీ అమితాబ్ బచ్చన్ డై హార్డ్ ఫ్యాన్ ఏం చేశారని అనుకుంటున్నారా.? అయితే ఇది చదివేయండి.

 Car Riding Is A Movie Favorite-వైరల్: కారు ఎక్కిన సినీ అభిమానం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ ఒకరు తన సరికొత్త మహీంద్రా థార్ డ్యాష్ బోర్డ్ పై అమితాబ్ బచ్చన్ పాపులర్ సినిమాల్లోని డైలాగ్ లతో పెయింట్ చేసాడు.

అయితే ఇందులో విశేషం ఏముంది అనుకోకండి.ఇందులోనే ఉంది అసలు మ్యాటర్.ఆ డై హార్డ్ ఫ్యాన్ తన మహీంద్ర థార్ డ్యాష్ బోర్డ్ పై అమితాబ్ బచ్చన్ ఆటోగ్రాఫ్ చేసేవరకు ఆ వాహనాన్ని నడపలేదని తెలిపాడు.అంతే కాదండోయ్.! అమితాబ్ అభిమాని వాహనమే కాకుండా తన చొక్కాను కూడా హీరో ఐకానిక్ డైలాగ్ లతో పెయింట్ చేయించుకున్నాడు.

దీంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో ను షేర్ చేస్తూ తన అభిమాని కోసం ఒక నోట్ రాశారు. అమితాబ్ బచ్చన్ ఇలా.” నా అభిమాని అతని కారుని మొత్తం నా సినిమా డైలాగులతో పెయింట్ చేశాడు ., అంతే కాకుండా అతని షర్ట్ పైన కూడా నా సినిమా పేర్లు ఉన్నాయి.మీరు కారు డోర్ తెరిచినప్పుడు సౌండ్ సిస్టమ్ నా సినిమాల డైలాగు లను ప్లే చేయడం ప్రారంభిస్తుంది.

ఇది చాలా అద్భుతంగా ఉంది.అతను ఈ కారును కొనుగోలు చేశాక నేను డ్యాష్ బోర్డులో ఆటో గ్రాఫ్ చేసే వరకు డ్రైవ్ చేయలేదని, ఈ విషయం తెలిశాక నేను ఆటోగ్రాఫ్ చేశాను” అని పోస్ట్ చేసారు.

ఈ ఫ్యాన్ మూమెంట్ మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా దృష్టిని కూడా ఆకర్షించడం విశేషం.

ఈ సందర్బంగా ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదిక గా మాట్లాడుతూ అమితాబ్ బచ్చన్ తో తన ఫ్యాన్ మూమెంట్ కోసం మహీంద్ర థార్ ని ఎంచుకోవడం ఈ డైలాగు లను జ్ఞాపకం తెచ్చింది అన్నారు.”ఆజ్ మేరే పాస్ గాడి హై, బంగ్లా హై, తుమ్హారే పాస్ క్యా హై?.అనురాగ్: మేరే పాస్ మహీంద్ర థార్ పర్ బిగ్ బి కా ఆటోగ్రాఫ్ హై” అన్నారు.

#Cini Fans

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube