కార్ ను తాళ్లతో కట్టేసిన యజమాని.. దొంగల భయం కాదు సుమా.. మరెందుకంటే..?

వర్షాకాలం అన్నాక వర్షాలు పడకుండా ఉంటాయా చెప్పండి.వర్షాకాలం వర్షం, చలికాలం చలి, ఎండాకాలం ఎండ అనేవి ప్రకృతి దర్మం.

 Car Owner Tied The Car With Ropes Over The Fear Of Heavy Rains, Viral Latest, Vi-TeluguStop.com

వర్షాలు కురిచినప్పుడు ఆ వర్షపు నీటి వలన ప్రజలు నానా అవస్థలు పడుతున్నారనే విషయం అధికారులు ముందుగా గుర్తించి వాటికి సొల్యూషన్ వెతకాలి.ఈ క్రమంలోనే తెలంగాణా జిల్లాలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాల కారణంగా వరదలు కూడా వస్తున్నాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా సంగతి అయితే చెప్పక్కర్లేదు.భారీ వర్షం కారణంగా సిరిసిల్లా అంతా తడిచిముద్దవుతుంది.

సిరిసిల్ల ప్రధాన రహదారి సమీపంలో ఉన్న కొత్త చెరువు పూర్తిగా నిండి వరదనీరు రోడ్డుపైకి పారుతోంది.పలు కాలనీలోకి వరద నీరు చేరుకుంది.

సిరిసిల్ల పట్టణంలోని కొన్ని కాలనీలలో నీరు నదుల మాదిరిగా ప్రవహిస్తున్నాయి.లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో మునిగిపోయాయి.ఎక్కడ రోడ్డు అనేది కనిపించడం లేదు.వరద ఉద్ధృతికి ఇళ్లలోని వస్తువులు, వాహనాలు కూడా కొట్టుకుపోతున్నాయి.

ఈ క్రమంలోనే అక్కడ ప్రజలు ఇంట్లోని వస్తువులను, వాహనాలను జాగ్రత్త చేసే పనిలో పడ్డారు.వరద ప్రవాహం నుంచి ఒక వ్యక్తి తన కార్ కొట్టుకుని పోకుండా ఉండేందుకు ఒక ఆలోచన చేసాడు.

ప్రస్తుతం అతనికి వచ్చిన ఆలోచనతో తన కార్ ను తాళ్లతో కట్టేసాడు.

Telugu Car, Floods, Heavy, Ktr, Sirisilla, Tied Car Rope, Latest-Latest News - T

ఈ ఘటనకు సంబందించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.ఆ ఫోటో చూసిన ప్రతి ఒక్కరు ‘ వాట్ ఏ ఐడియా సర్ జి’ అని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.వరద ప్రవాహం నుంచి తన కార్ ను కాపాడుకోవడానికి ఓ కారు యజమాని తన ఇంటి ఉన్న ఖాళీ స్థలంలో కారుని తాళ్లతో కట్టేశాడు.

సిరిసిల్లా ప్రాంతంలో వరద ఉదృతి ఎలా ఉందని చెప్పడానికి ఈ ఫోటో ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.కాగా మంత్రి కేటీఆర్, అధికారులు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టారు.

అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పంపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube