వైరల్‌ వీడియో : కాలువలో పడ్డ కారు నుండి చిన్న పిల్లాడిని బయటకు విసిరేశాడు, చివరకు ఏమైందో చూడండి

మద్యప్రదేశ్‌లో నివారి జిల్లాలో ఒక వింత యాక్సిడెంట్‌ జరిగింది.ఆ యాక్సిడెంట్‌లో అంతా బాగానే ఉన్నారు.

 Car Lost Balance Fell Into A River In Orchha Town-TeluguStop.com

కారు కాలువలోకి పడటంతో పెద్ద ప్రమాదం అనుకున్నారు.కాలువలో నీరు తక్కువగా ఉండటం వల్ల అదృష్టం కొద్ది అంతా బయట పడ్డారు.

అయితే ఆసక్తికర విషయం ఏంటీ అంటే ఈ యాక్సిడెంట్‌లో ఒక చిన్న బాబుతో స్థానికులు మరియు కారు యాక్సిడెంట్‌కు గురైన వారు ఆడుకున్నారు.వీడియోలో చూస్తే బాబోయ్‌ అనిపిస్తుంది.

Telugu Car Balance, Fellriver, Nivari Distict, Orcha, Telugu General, Telugu-

  పూర్తి వివరాల్లోకి వెళ్తే.నివారి జిల్లా ఓర్చా పట్టణంలో ఒక ఇరుకైన వంతెన ఉంది.ఆ వంతెన పై నుండి ఒక సమయంలో ఒకే వెయికిల్‌ వెళ్లాల్సి ఉంటుంది.కాని ఒక కారు స్పీడ్‌గా దూసుకు వచ్చింది.ఆ సమయంలోనే ఆటో వంతెనపై ఉంది.మొదట కారు ఆటోను ఢీ కొట్టి వెంటనే కాలువలో పడిపోయింది.

కారులో ఉన్న వారు అంతా వెంటనే బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు.కారులో ఉన్న వ్యక్తి చిన్న పిల్లడిని తీసి బయటకు వచ్చాడు.

Telugu Car Balance, Fellriver, Nivari Distict, Orcha, Telugu General, Telugu-

  యాక్సిడెంట్‌ అయిన వెంటనే అక్కడికి స్థానికులు వచ్చారు.సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ఒడ్డున ఉన్న స్థానికులకు పట్టుకోవాలంటే బాబును కారులో ఉన్న వ్యక్తి బంతిని విసిరినట్లుగా విసిరేశాడు.ఆ సమయంలో అతడి బలం సరిపోకపోవడంతో ఒడ్డున వారి వద్దకు వెళ్లలేదు.

అదృష్టవశాత్తు ఏ బండకు తాకుండా నీళ్లలోనే పడ్డాడు.నీళల్లో పడ్డ ఆ పిల్లాడిని కాపాడేందుకు ప్రయత్నించారు.

సఫలం అయ్యారు.ఇక కారులోంచి అంతా కూడా బయటకు వచ్చారు.

నీళ్లు తక్కువ ఉన్నా కూడా కారు మొత్తం మునిగి పోయింది.సిసి టి‌వి లో రికార్డ్ అయిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube