కారులో మంటలు.. అప్రమత్తమైన డ్రైవర్..!

రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.కారులో నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన ఆ కారు డ్రైవర్ బయటకు దిగి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు.

 Ap, Vishakapatnam, Car, Fire Accident-TeluguStop.com

మంటలు మండటం చూసి రోడ్డు పక్కన ఉన్న ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.రోడ్డు పక్కన ఉన్న ప్రయాణికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

విశాఖ రోడ్డు ఊర్వశి కూడలి జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా షాట్ సర్కూట్ అయి మంటలు చెలరేగాయి.కారులో మంటలు చెలరేగి, కారు నిండా పొగమంచు కమ్మెసింది.

దీంతో అప్రమత్తమైన డ్రైవర్ కారు నుంచి బయటకు దిగి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు.మంటలు ఆరకపోవడంతో స్థానికుల సాయంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి అదుపులోకి తీసుకొచ్చింది.

వర్షం పడుతున్నా మంటలు రావడంతో ఆశ్చర్యంగా ఉందని స్థానికులు తెలిపారు.కారులో ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు.కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడానికి కారణాలేంటని డ్రైవర్ ని అడిగి తెలుసుకున్నారు.షార్ట్ సర్య్కూట్ వల్ల మంటలు చెలరేగి ఉంటాయని డ్రైవర్ సమాధానమిచ్చాడు.

కారులో మంటలు చెలరేగడం చూసి ఒక్కసారిగా ఆ ప్రాంతంలో స్థానికులు గుమిగూడి ఆందోళనకు గురయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube