వ‌ర‌ద‌ల్లో దూసుకుపోతున్న కారు.. ఫిదా అవుతున్న ఆనంద్ మ‌హీంద్రా

ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త అయిన‌టువంటి ఆంన‌ద్ మహీంద్రా నిత్యం సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.ఏదైనా వైర‌ల్ కంటెంట్ ఉన్న వీడియో అయితే వెంట‌నే తనదైన శైలిలో స్పందిస్తుంటారాయన.

 Car Crashing Into Floods Anand Mahindra Falling-TeluguStop.com

స‌మాజంలో ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల‌పై ట్విట్టర్‌ వేదికగా త‌న‌దైన స్టైల్ లో ఆసక్తికర పోస్టులు పెడుతుంటారు మ‌హీంద్రా.ఇక ఆయ‌న పెట్టే పోస్టులు కూడా బాగానే చర్చకు దారి తీస్తాయి.

ఆయ‌న‌కు సోష‌ల్ మీడియాలో కూడా బాగానే ఫాలోయింగ్ ఉంది.ఇక ఇప్పుడు కూడా ఆయ‌న ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు.

 Car Crashing Into Floods Anand Mahindra Falling-వ‌ర‌ద‌ల్లో దూసుకుపోతున్న కారు.. ఫిదా అవుతున్న ఆనంద్ మ‌హీంద్రా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే.దీంతో గుజ‌రాత్‌లోని రాజ్‌ కోట్ సిటీ మొత్తం వరద నీటితో మునిగిపోయింది.ఇక రోడ్లపై నిండా నీరే ఉండ‌టంతో ఎటు చూసినా కూడా చుట్టూ నీరే క‌నిపిస్తోంది.కాగా ఇలాంటి వ‌ర‌ద నీటిలో కూడా పోలీసులు రెస్క్యూ కోసం స్థానిక ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించేందుకు కూడా ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా వరద నీటిలోనే కారులో బ‌య‌లు దేరి వెళ్లారు.

అయితే నీరు ఎక్కువ‌గా ఉన్నా కూడా వారు ముందుకు సాగుతున్నారు.రోడ్లు క‌నిపించ‌క‌పోయినా కూడా వారు అలాగే ప‌య‌నిస్తున్నారు.

దీంతో ఇదంతా అక్క‌డున్న వీడియో తీశారు.ఇక్క‌డ విష‌యం ఏంటంటే ఆ పోలీసులు ప్రయాణించిన కారు మహీంద్ర కంపెనీకి చెందిన బొలేరో అని తెలుస్తోంది.ఇక ఈ వీడియోను ఆంనంద్ మ‌హీంద్రా కంట ప‌డ‌టంతో ఆయ‌న దీన్ని పోస్టు చేస్తూ ‘మహీంద్రాకు ఇది సాధ్యమే’ అంటూ చెప్పారు.ఇంకేముంది ఇలాంటి వీడియోలు ఇట్టే వైర‌ల్ అయిపోతాయి క‌దా.

ఇది కూడా అలాగే వైరల్‌ అవుతూ ఉంది.మ‌రి నెటిజ‌న్లు ఊరుకుంటారా దీన్ని త‌మ కామెంట్ల‌తో హోరెత్తిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ వీడియో పెద్ద చ‌ర్చ‌కు దారి తీస్తోంది.మ‌రి మీరు కూడా చూసేయండి.

#Anand Mahindra #Floods #Rescue Team

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు