అమ్మ చనిపోయిందని వస్తున్న కూతుళ్లు.. 10 నిముషాల్లో ఊరికి చేరుతామనగా వారికి కూడా..

రోజు రోజుకూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి.దీనికి మద్యం సేవించి వాహనం నడపడం ఒక కారణమైతే అతివేగం మరొక కారణం.

 Car Accident In Guntur While Family Members Going To Attend Mother Funeral-TeluguStop.com

మితిమీరిన వేగం వల్ల రోడ్డు ప్రమాదాల్లో చనిపోయి కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగుల్చుతున్నారు.తాజాగా గుంటూరు జిల్లాలో కూడా ఒక రోడ్డు ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదం కూడా అతివేగం కారణంగానే జరిగిందని తెలుస్తుంది.

 Car Accident In Guntur While Family Members Going To Attend Mother Funeral-అమ్మ చనిపోయిందని వస్తున్న కూతుళ్లు.. 10 నిముషాల్లో ఊరికి చేరుతామనగా వారికి కూడా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తల్లి చనిపోయిందని ఇద్దరి కూతుళ్ళకు సమాచారం అందడంతో వాళ్ళు అప్పటి కప్పుడు కారు మాట్లాడుకుని రాత్రి సమయంలోనే బయల్దేరారు.

అంత దూరం నుండి బాగానే వచ్చారు కానీ ఊరు మరో రెండు కిలోమీటర్లు ఉందనగా డ్రైవర్ అతివేగం కారణంగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా మిగతా వారికి తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

గుంటూరు జిల్లా పత్తిపాడు గ్రామానికి చెందిన ప్రసాదరావు అనే వ్యక్తి భార్య చనిపోయింది.తల్లి చనిపోయిందని సమాచారం అందడంతో ఆమె కూతుళ్లు ఇద్దరూ బాపట్ల నుండి భర్తలు, పిల్లలు, మేన మామలు అందరూ కలిసి ఒక కారు మాట్లాడుకుని అర్ధరాత్రి సమయంలో ఉరికి బయల్దేరారు.

కొంత దూరం బాగానే వచ్చిన అతివేగం కారణంగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి అయ్యింది.

పత్తిపాడు చేరుకోవడానికి మరో రెండు కిలో మీటర్లు ఉందనగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.అందులో ప్రయాణిస్తున్న మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు.దీంతో వారిని అంబులెన్స్ లో జీ జీ హెచ్ కు తరలించి చికిత్స చేయిస్తున్నారు.పాపం తల్లిని కడసారి చూడాలని బయల్దేరి చివరి చూపు కూడా చూడకుండానే వాళ్ళు కూడా ఆసుపత్రి పాలయ్యారు.

#Mother Funeral #Guntur #Car Accident

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు