మద్యం మత్తులో కారుతో ఔట‌ర్ రింగురోడ్డు పై బీభ‌త్సం సృష్టించిన యువకులు.. !

రోజు రోజుకు సమాజంలో బాధ్యతరాహిత్యంగా ప్రవర్తించే వారి సంఖ్య పెరిగిపోతుంది.  తా జెడ్డ కోతి వనమెల్లా చెరచినట్లుగా చచ్చే వారు చావక పక్కనున్న వారికి కూడా ప్రమాదాన్ని కలిగిస్తున్నారు.

 Car Accident At Orr Service Road Shamshabad-TeluguStop.com

ఇలా మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల చోటు చేసుకుంటున్న ప్రమాదాల వల్ల కుటుంబాలే అనాధలుగా మారుతున్నాయి.చట్టాలను ఎంత కఠినంగా మార్చినా మార్పు అనేది రావడం లేదు.

ఇకపోతే శంషాబాద్ స‌మీపంలోని ఓఆర్ఆర్ స‌ర్వీస్ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన కారు ఓ బైక్‌ను ఢీకొట్టి, క‌ల్వ‌ర్టులోకి దూసెళ్లి బోల్తా కొట్టింది.కాగా ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్ద‌రు యువ‌కులకు తీవ్రంగా గాయాలు అయ్యాయని సమాచారం.

 Car Accident At Orr Service Road Shamshabad-మద్యం మత్తులో కారుతో ఔట‌ర్ రింగురోడ్డు పై బీభ‌త్సం సృష్టించిన యువకులు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను సమీపంలోని ఆస్పత్రికి త‌ర‌లించారట.కాగా ప్రమాదానికి కారణం అయిన యువకులు మ‌ద్యం సేవించి ఉన్నట్లుగా తేలిందట.

#Car Accident #Bike #Shamshabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు