మ్యాచ్‌ల్లోనే కాదు టాస్ గెలవడంలోనూ అరుదైన రికార్డు సాధించిన ధోనీ..!

కెప్టెన్‌గా టీమిండియా జట్టుకే కాదు.ఐపీఎల్‌ జట్టుకు కూడా అత్యధిక విజయాలు తెచ్చిపెట్టి నంబర్ వన్ సారధిగా ధోని పేరుగాంచారు.ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 10 సార్లు ప్లేఆఫ్స్ కు.9 సార్లు ఫైనల్ కు చేరింది.మూడు సార్లు ఛాంపియన్షిప్ గా నిలిచింది.సీఎస్‌కే ఐపీఎల్ 2021 సీజన్‌లో ఫైనల్స్ కి అర్హత సాధించిన మొట్టమొదటి జట్టుగా నిలిచింది.

 Captain Ms Dhoni Creates Strange Record Of Winning Toss In T20 Matches, Ms Dhoni-TeluguStop.com

తాజాగా సీఎస్‌కే క్వాలిఫైయర్ ఫస్ట్ రౌండ్ లో ప్రత్యర్థి జట్టు అయిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది.అయితే తొలి క్వాలిఫైయర్‌లో ధోనీ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్ లో టాస్ గెలవడంతో ధోని ఖాతాలో ఓ సరికొత్త రికార్డు నమోదయింది.టీ20ల్లో టాస్ గెలుపొందడం ధోనికి ఇది 150 వ సారి కావడం విశేషం.దీంతో ఎక్కువసార్లు టాస్ గెలిచిన కెప్టెన్‌గా ధోనీ సంచలనం సృష్టించారు.

ఇప్పటివరకు ధోని టీమిండియాకి 72 టీ20 మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహరించారు.

ఐపీఎల్‌లో 200 పైగా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు.మొత్తంగా చూసుకుంటే 272 మ్యాచ్‌ల్లో ధోని 150 మ్యాచులకు గానూ టాస్ గెలిచారు.

ఇక అత్యధిక ప్లేఆఫ్ మ్యాచులు ఆడిన ఆటగాడిగా కూడా ధోని పేరు తెచ్చుకున్నారు.

Telugu Dhoni, Csk Dc, Ipl, Latest, Msdhoni, Strange, Tass, Matches-Latest News -

ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కుర్రకారు జట్టయిన ఢిల్లీని ఓడించి ఫైనల్ కు చేరింది.దీంతో ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ ఆడే అతి పెద్ద వయసున్న కెప్టెన్‌గా కూడా ధోనీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు.ప్రస్తుతం ధోనీ వయసు 40 ఏళ్ల.

ఈ వయస్సులోనూ ఐపీఎల్ జట్టును విజయ తీరాల వైపు నడిపిస్తూ తనకు తానే సాటిగా నిరూపించుకుంటున్నారు.

ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఢిల్లీ క్యాపిటల్స్ 172 పరుగులు చేసింది.173 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన చెన్నై జట్టు 19.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.దీనితో సీఎస్‌కే జట్టు 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube