ఆస్ట్రేలియా- భారత్ 3 వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్లో ఇండియా ఘన విజయం సాధించింది.వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇండియా ఓడిపోయే దిశగా సాగుతూ చివరకు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఈ ఘన విజయానికి కేఎల్ రాహుల్ (75), రవీంద్ర జడేజా (45)( KL Rahul ) కీలక పాత్ర పోషించారు.189 పరుగుల లక్ష్య చేదనతో బరిలోకి దిగిన భారత్ 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడంతో భారత్ ఓడిపోతుంది అనే అంచనాలు కనిపించాయి.భారత జట్టులో మొదట బ్యాటింగ్ చేసిన ఇషాన్ కిషన్, శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ లు తొందరగా అవుట్ అవ్వడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది.తరువాత రంగంలోకి దిగిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా 25 పరుగులు చేసి వెనుతిరిగాడు.

84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన భారత్ ఓటమి తప్పదు అనుకుంది.ఇలాంటి కష్టకాలంలో రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆట ప్రదర్శన కనబరిచారు.ఎక్కడ కూడా తప్పటడుగు వేయకుండా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ, క్రమంగా పరుగులు చేస్తూ లక్ష్యా గమ్యాన్ని చేరారు.కేఎల్ రాహుల్ తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు.
తనపై వస్తున్న వరుస విమర్శలకు గట్టిగా చెక్ పెట్టేశాడు.పీకల్లోతు కష్టాల్లో ఉండి, ఓడిపోయే దిశగా ఉన్న మ్యాచ్ ను మలుపు తిప్పి, భారత్ గెలుపులో భాగస్వామి అయ్యాడు.
మ్యాచ్ గెలిచిన అనంతరం కెప్టెన్ హార్దిక్ పాండ్యా( Hardik Pandya ) మాట్లాడుతూ, తాము కాస్త ఒత్తిడికి లోనయ్యామని తన వికెట్ పడిన తర్వాత భారత్ క్లిష్ట పరిస్థితుల నుండి వీరిద్దరే గట్టెక్కించారని, ఆ సమయంలో మరొక వికెట్ పడితే గెలుపు అసాధ్యమని తెలిపాడు.

లబుషేన్ ఇచ్చిన క్యాచ్ ను రవీంద్ర జడేజా( Ravindra Jadeja ) పట్టిన తీరు గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే.భారత్ జట్టు ఫీల్డింగ్ లో కీలకమైన సమయాలలో వికెట్లు తీయడం, బ్యాటింగ్ కు దిగిన భారత్ తక్కువ పరువులకే ఐదు వికెట్లను కోల్పోయినప్పుడు మ్యాచ్ ను మలుపు తిప్పి, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా లు అద్భుతంగా రాణించారని తెలిపాడు.
