సూర్య సినిమాపై స్పందించిన రియల్ హీరో గోపినాథ్

టాలెంటెడ్ హీరో సూర్య, నేషనల్ అవార్డు దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా ఆకాశం నీ హద్దురా.ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంది.

 Captain Gr Gopinath Praises Soorarai Pottru, Tollywood, Kollywood, Indian Cinema-TeluguStop.com

ఈ సినిమాని దర్శకురాలు సుధా కొంగర ప్రముఖ వ్యాపారవేత్త ఎయిర్ దక్కన్ అధినేత కెప్టెన్ గోపినాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కించింది.ఒక సామాన్యుడు అత్యున్నత లక్ష్యంతో విమానయాన సంస్థ స్థాపించడం.

సామాన్యుడికి విమానప్రయాణం అందేలా ఎలా చేశాడు అనే ఎలిమెంట్ తో ఎమోషనల్ జర్నీగా సుధా కొంగర ఈ సినిమాని తెరకెక్కించింది.అయితే కథ పరంగా కొంత కల్పితం జోడించింది.

సినిమా నేరేషన్ అందరికి బాగా కనెక్ట్ అయ్యింది.అందుకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటుంది.

ఇదిలా ఉంటే తన బయోపిక్ తో తెరకెక్కిన ఆకాశం నీ హద్దురా సినిమాపై రియల్ హీరో గోపినాథ్ స్పందించారు.

ఆకాశం నీ హద్దురా తన కథకి ఓ కల్పిత కథాంశం జోడించి తీసిన సినిమాగా ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే భావోద్వేగాలకు అనుగుణంగా సినిమాను భాగా తీశారని ప్రశంసించారు.సినిమాలో సూర్య, హీరోయిన్ అపర్ణ బాలమురళి బాగా నటించారని అన్నారు.సూర్య నటన శక్తివంతంగా సాగిందని అన్నారు.కలలను సాకారం చేసుకునేందుకు పిచ్చిగా ప్రయత్నించే వ్యక్తి పాత్రలో సూర్య ఒదిగిపోయాడని పేర్కొన్నారు.

చీకటి సమయాల్లో బయటకి వచ్చిన అద్భుతమైన కథ ఇది.గొప్ప ఉత్సాహ భరితమైన కథ అనడంలో ఎలాంటి సందేహం లేదంటూ గోపీనాథ్ చిత్ర బృందాన్ని ప్రశంసించారు.గోపినాథ్ ప్రశంశలపై హీరో కూడా రియాక్ట్ అయ్యాడు.తమ ప్రయత్నాన్ని ప్రశంసించినందుకు ధన్యవాదాలు తెలిపారు.అలాగే సినిమాకి వస్తున్న టాక్ పట్ల కూడా సూర్య హర్షం వ్యక్తం చేశారు.తమ కష్టానికి తగిన ఫలితం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube