దెయ్యాల నగరంగా మారిన ఆ దేశపు రాజధాని...

దేశంలో రాజధాని అంటే ఎక్కడైనా అను నిత్యం జనాలతో మరియు వ్యాపారాలతో కిటకిటలాడుతూ ఉంటుంది.అంతేగాక దేశం మొత్తం యొక్క పాలన రాజధాని నగరం నుంచే శాసించే విధంగా ఉంటుంది.

 Capital City Of Myanmar Nepida-TeluguStop.com

అయితే  మయన్మార్ రాజధానిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది.

అంతేగాక దాదాపుగా 28,000 వేల కోట్లు రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ నగరం ప్రస్తుతం మనుషులు లేక వెలవెలబోతోంది.

దీంతో ఈ నగరం ఘోస్ట్ క్యాపిటల్ గా పిలువబడుతోంది. ఇందులో ఖరీదైన షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద భవనాలు విలాసవంతమైన హోటల్లో, ఇలా ఎన్నెన్నో ప్రత్యేక సౌకర్యాలు ఉన్నప్పటికీ ఈ నగరం ఎప్పుడూ బోసి పోయినట్లుగా ఉంటుంది.

ముఖ్యంగా ఇందులో 20 లైన్ల హైవే రహదారిని కూడా నిర్మించారు.అయితే ఎన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ జనాలు అక్కడ నివసించడానికి మొగ్గుచూపడం లేదు.దీంతో పర్యాటకులు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి భయపడుతున్నారు.

Telugu Burma, Ghost, Latest Myanmar, Myanmar, Nepida, Nepida Burma, Nepida Lates

అయితే  ఇందుకు  కారణం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు.ఈ నగరాన్ని సరైన పద్ధతి లేకుండా నిర్మించినందువల్లనే ఈ నగరం ఇలా మిగిలిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ కారణంగానే జనాలు ఇక్కడ నివసించడానికి భయపడుతున్నారని అంటున్నారు.

అయితే దీనిపై స్పందించినటువంటి పలువురు పాలక వర్గాలు మాత్రం ఈ నగరం భవిష్యత్తులో ఉపయోగపడుతుందని అందువల్లనే దీన్నిముందు కార్యాచరణలో భాగంగా నిర్మించామని అంటున్నారు.

అంతేగాక ఇప్పటికే నగరాల్లో జనాభా ఎక్కువైపోతూ ఉండడంతో వాటిని మరింత విస్తరిస్తే భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందని అందు వల్లనే ఇలా నగర శివార్లలో భూమిని ఎంపిక చేసుకొని డెవలప్ చేసినట్లు పాలక వర్గాలు చెబుతున్నాయి.

 అయితే ప్రస్తుతం ఇలా జనాలు లేకుండా ఉన్నప్పటికీ భవిష్యత్తులో మాత్రం కచ్చితంగా జనకళ సంతరించుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube