రాజధానిపై మీరు స్పందించరేం?

ఏపీ రాజధాని విషయంలో రచ్చ జరుగుతూనే ఉంది.గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించగా ఇప్పుడు వచ్చిన వైకాపా ప్రభుత్వం మాత్రం రాజధానిగా అమరావతి మాత్రమే కాకుండా వైజాగ్‌ మరియు కర్నూలు కూడా అంటూ ప్రకటించింది.

 Capital Amaravathi Telugu Cinema People-TeluguStop.com

త్వరలోనే మూడు రాజధానులను ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు మరియు విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలు రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రజా సంఘాలు మరియు పలు పార్టీల వారు అమరావతిని రాజధానిగా కొనసాగించాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తూ ఉద్యమాలు చేస్తున్నారు.కాని తెలుగు సినిమా పరిశ్రమ వారు మాత్రం రాజధాని విషయంలో నోరు మెదపడటం లేదు.

రాజధాని విషయమై తెలుగు సినిమా వారు వెంటనే స్పందించాలని, అమరావతికి మద్దతుగా ముందుకు రావాలంటూ ఆందోళన కారులు డిమాండ్‌ చేస్తున్నారు.వెంటనే సినిమా పరిశ్రమ వారు రాజధానిపై స్పందించకుంటే రాష్ట్రంలో ఉన్న థియేటర్లలో సినిమాలు ఆడనివ్వము అంటూ ఆందోళనకారులు హెచ్చరించారు.

మరి ఇప్పుడైనా తెలుగు సినిమా స్టార్స్‌ రాజధాని విషయంలో స్పందిస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube