తెలంగాణలో ఈ ఏడాది చివర్లో నవంబర్ లేదా డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు( Assembly elections ) జరగాల్సిఉంది.కానీ కేంద్రం జమిలి ఎలక్షన్స్ వైపు అడుగులు వేస్తున్న సంకేతాలు రావడంతో తెలంగాణ ఎన్నికలు సందిగ్ధంలో పడిపోయాయి.
ఈ పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అందరు భావించారు.కానీ జమిలి ఎన్నికలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే పార్లమెంట్ సమావేశాలను ముగించింది మోడి సర్కార్( Modi Sarkar ).దీంతో జమిలి ఎన్నికలు లేనట్లే అనే భావనా కలుగుతోంది.దీంతో తెలంగాణ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆల్రెడీ అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల పోరులో ముందున్న అధికార బిఆర్‌ఎస్( Brs ).ప్రచారాన్ని మాత్రం హోల్డ్ లో ఉంచింది.దానికి కారణం జమిలి ఎలక్షన్స్ పై వస్తున్న వార్తాలే.కానీ జమిలి ఎలక్షన్స్ పై ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో ఇక ప్రచారంలో వేగం పెంచాలని కేసిఆర్( KCR ) డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఎన్నికల హామీలను రెడీ చేసిపెట్టుకున్న కేసిఆర్.ఇక అమ్ముల పొదలోని ఒక్కో అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్దమయ్యారట.త్వరలో బిఆర్‌ఎస్ మేనిఫెస్టో ప్రకటిస్తామని ఇప్పటికే అధికార బిఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ( Congress party ) ఇప్పటికే ఆరు హామీలు ఆరు గ్యారెంటీలు అంటూ ప్రచారాన్ని మొదలు పెట్టింది.ఇక ఇప్పుడు బిఆర్‌ఎస్ వంతు వచ్చింది.కాంగ్రెస్ ను తలదాన్నెలా కేసిఆర్ మేనిఫెస్టో రూపొందించారని బిఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.
మేనిఫెస్టో ఎప్పుడు ప్రకటిస్తానే దానిపై ఎలాంటి క్లారిటీ లేనప్పటికి.బిఆర్‌ఎస్ మేనిఫెస్టో మాత్రం ఎవరు ఊహించని విధంగా ఉంటుందనేది ఆ నేతలు చెబుతున్నా మాట.కాగా ఎన్నికల ముందు అందరి దృష్టి బిఆర్‌ఎస్ మీద ఉంచడం కేసిఆర్ మొదటి నుంచి అనుసరిస్తున్న వ్యూహం.మరి ఈసారి కూడా ఇందరి చూపు బిఆర్‌ఎస్ పైనే ఉండేలా కేసిఆర్ ప్రణాళిక సిద్దం చేసుకున్నారట.
మొత్తానికి జమిలి ఎన్నికలపై క్లారిటీ లేకపోవడంతో కేసిఆర్ హ్యాట్రిక్ విజయం కోసం తన స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.