ప్రపంచం మొత్తాన్ని వణికించిన పడవ ప్రమాదం..ఏకంగా 60మంది!!

ఇటీవల కాంగో నది లో జరిగిన బోటు ప్రమాదం ప్రపంచం మొత్తాన్ని వణికించింది.నదిలో వెళ్తున్న గొడవ ఒక్కసారిగా ప్రమాదానికి గురికావటంతో పడవలో ఉన్న 60 మంది ప్రయాణికులు మరణించడం జరిగింది.

 Cango Boad Accident, Cango, Kinhasa, Langola, Pravins-TeluguStop.com

సరిగ్గా ఈ ఘటన మాయి నోడోంబీ ప్రావిన్స్‌లోని లాంగోలా ఎకోటి గ్రామానికి సమీపంలో జరిగింది.పడవ ప్రయాణిస్తున్న సమయంలో 700 మంది ప్రయాణికులు ఉన్నారని ఇప్పటివరకు 60 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు మరికొంత మంది గల్లంతైనట్లు, వారి కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు కాంగో మంత్రి ఎంబీకాయి వెల్లడించారు.

ఇదిలా ఉంటే 300 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడినట్లు స్పష్టం చేశారు.ఈ పడవ కిన్హాసా నుంచి బయలుదేరి భూమధ్య రేఖ ప్రావిన్స్‌ వైపు వెళ్తుండగా, ఈ ప్రమాదానికి గురైనట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే పడవ లో ఎక్కువ మంది ప్రయాణికులు ఉండటం వల్లనే పడవ మునిగిపోయినటు మంత్రి వెల్లడించారు.కాగా సమాచారం తెలిసిన వెంటనే.గాలింపు చర్యలు స్టార్ట్ చేసినట్లు అందువల్లనే 300 మందిని సకాలంలో రక్షించినట్లు స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube