'మా' ఎన్నికల్లో తారక్ ను లాగి రాజకీయం చేస్తున్న అభ్యర్థులు!

టాలీవుడ్ సినీ పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియషన్ మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి.అయితే ఇంతకు ముందు వరకు మా ఎన్నికలు ఇంత రసవత్తరంగా ఉండేవి కాదు.

 Candidates Who Are Dragging Tarak Into Politics In Maa Elections Details, Jr Ntr-TeluguStop.com

కానీ ఇప్పుడు మాత్రం ప్రత్యర్థులపై వ్యాఖ్యలు చేస్తూ మా ఎన్నికలను కూడా రాజకీయం చేసేసారు.తాజాగా ఈ ఇష్యులో తారక్ ను కూడా లాగేసారు.

దీంతో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి.

అక్టోబర్ 10న జరగనున్న మా ఎన్నికలకు ఎప్పటి నుండో ప్రచారం చేసుకుంటున్నారు.

ఎంతో మంది పోటీ పడగా చివరకి మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మాత్రమే అధ్యక్ష పదవి బరిలో ఉన్నారు.ఇక వీరిద్దరికి పెద్ద కుటుంబాల మద్దతు కూడా లభించింది.

ప్రకాష్ రాజ్ కు మెగా కుటుంబం మద్దతు తెలుపగా.మంచు విష్ణు కు నందమూరి బాలకృష్ణ, కృష్ణం రాజు మద్దతు తెలిపారు.

ఇక ఈ ఇద్దరి అభ్యర్థులకు మద్దతుగా నిలిచిన వారు ఒకరిపై ఒకరు దూషించుకుంటూ వాదప్రతివాదనలు చేసుకుంటూ ఈ ఎలెక్షన్స్ ను వేడెక్కిస్తున్నారు.

Telugu Jr Ntr, Latest, Maa, Manchu Vishnu, Artist, Prakash Raj, Tollywood-Movie

ఇక తాజాగా వీళ్ళ రాజకీయంలోకి ఎన్టీఆర్ ను కూడా లాగారు.జీవిత తనకు ఓటు వేయాలని కోరగా అందుకు తారక్ తాను ఓటు వేయనని అన్నాడని జీవిత ప్రెస్ మీట్ లో చెప్పింది.దీంతో ఇప్పుడు ఈ విషయంపై టాలీవుడ్ లో రచ్చ జరుగుతుంది.

Telugu Jr Ntr, Latest, Maa, Manchu Vishnu, Artist, Prakash Raj, Tollywood-Movie

ప్రస్తుతం మా ఎసోసియషన్ లో పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని అందుకే ఓటు వేయను అని అన్నాడని జీవిత మీడియా ముందు చెప్పడంతో ఇప్పుడు ఈ వార్తను నెగిటివ్ గా ప్రచారం చేస్తూ న్యూస్ ఛానెల్స్ వాళ్ళు టీఆర్పీ పెంచుకునే పనిలో ఉన్నారు.ఈ విషయంపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.తారక్ అలా ఓటు వేయమని చెప్పడం కరెక్ట్ కాదని ఆయనకు ఫోన్ చేసి అలా మాట్లాడడం కరెక్ట్ కాదని వచ్చి నచ్చిన వారికీ ఓటు వేయమని కోరుతానని తెలిపారు.మొత్తానికి జీవిత తారక్ పేరును చెప్పడంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube